భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విషాద సంఘటన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాట. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయం తరువాత చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణాలు సంభవించాయి. ఈ విషాద సంఘటన తరువాత నగరం నడిబొడ్డున ఉన్న స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణ, జనాలను కంట్రోల్ చేయడం కష్టమని భావించిన కర్నాటక ప్రభుత్వం బెంగళూరు శివార్లలోని బొమ్మసాంద్ర ప్రాంతంలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1650 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 80 వేల మంది ప్రేక్షకుల కూర్చునే కెపాసిటీతో భారీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ మెగా క్రికెట్ స్టేడియం ప్రాజెక్ట్ కు పాలనాపరమైన అనుమతులే కాకుండా, నిధుల విడుదలకూడా జరగడంతో త్వరలోనే నగరం నడిబొడ్డున ఉన్న చిన్నస్వామి స్టేడియం నుండి శివార్లలో ఉన్న బొమ్మసాంద్రలోని కొత్త స్టేడియంకు క్రికెట్ మ్యాచ్ లు తరలిపోనున్నాయి. ఈ కొత్త స్టేడియం దాదాపు 80,000 మంది కూర్చునే సామర్థ్యంతో. ఆధునిక సౌకర్యాలతో ఉంటుంది. చిన్న స్వామి స్టేడియం సామర్థ్యం 40 వేలు మాత్రమే.. అంటే ఈ కొత్త స్టేడియంలో అంతకు రెట్టింపు మంది ప్రేక్షకులు మ్యాచ్ లు వీక్షించే అవకాశం కల్పిస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-cricket-stadium-in-bengaluru-39-203904.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.