కొత్త ప్రపంచ ఛా౦పియన్ 'కార్ల్‌సన్‌'

Publish Date:Nov 23, 2013

Advertisement

 

 

 

ప్రపంచ చెస్ సరికొత్త చాంపియన్ గా యువ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ ఆవిర్భవించాడు. సొంతగడ్డపై ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు షాకిచ్చాడు. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ తొలిసారిగా ప్రపంచ చాంపియన్‌షిప్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పదో రౌండ్‌ను డ్రా చేసుకున్న కార్ల్‌సన్ 12 గేమ్‌ల ఈ మ్యాచ్‌లో మరో రెండు రౌండ్లు మిగిలుండగానే టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.

 

పది రౌండ్లు ముగిసే సరికి 6.5-3.5తేడాతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ పది రౌండ్లలో మూడు గేమ్‌లు నెగ్గిన కార్ల్‌సన్, ఏడు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. కాగా, సొంతగడ్డపై నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆనంద్ ఒక్క గేమ్‌లో కూడా విజయం సాధించలేకపోయాడు. ఆనంద్ 2000, 2007, 2008, 2010, 2012లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు సాధించాడు. ఆనంద్ తన 22 ఏళ్ల కెరీర్‌లో కనీసం ఒక్క విజయం కూడా లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ముగించడం ఇదే తొలిసారి.

By
en-us Political News

  
ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 35.19 కోట్ల రూపాయల వ్యవయంతో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ మౌలిక సదుపాయాలలో ప్రధానంగా దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణం వంటివి ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్‌లో ఈ ఉదయం జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు ఖతమయ్యారు. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా శనివారం (జనవరి 3) ఉదయంజరిగిన రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో 12 మంది మావోలు మరణించగా, బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ మరణించారు.
తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు.
ఈ ఒక్క బ్రిడ్జితో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఔను ఎప్పుడో నాలుగేళ్ల కిందట విశాఖపట్నం, రాజాం రోడ్డులో చీపురుపల్లి సమీపంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అది శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలను కలిపే ఈ కీలక బ్రిడ్జి మూతపడటంతో వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గమ్యస్థానాలకు చేరడానికి నిత్యం 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీనివాస కల్యాణంలో ప్రపంచ తెలుగు మహా సభలకు అంకురార్పణ జరిగింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, సన్మానాలతో పాటు తెలుగు చలన చిత్ర గీతాలాపనలు జరగనున్నాయి.
సిర్గాపూర్ ఎస్సీ బీలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి వేధిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం (జనవరి 1) రాత్రి కడ్పల్, సిర్గాపూర్ రహదారిపై బైఠాయించారు. దీంతో అధికారులు హాస్టల్ కు వచ్చి విచారణ జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్ కిషన్ నాయక్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున రహదారి భద్రతా సెస్సెను వసూలు చేస్తారు. అయితే ఈ సెస్సు నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు మినహాయింపునిచ్చారు.
భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
పెండ్యాల సురేందర్ స్వరూప దంపతులు ఐదేళ్ల కిందట వరంగల్‌లోని మహారుషి గోశాల నుండి ఓ ఆవును తెచ్చుకుని దానికి గౌరి అని నామకరణ చేసారు. దానిని నిత్యం పూజిస్తూ కన్నబిడ్డలా సాకారు. ఆ ఆవు గత నెల 19న ఓ లేగదూడకు జన్మనిచ్చింది. లేగదూడ పుట్టి 13 రోజులు పూర్తి కావడంతో ఆ లేగదూడకు ఘనంగా నామకరణ మహోత్సవం నిర్వహించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏకాంత సేవ అనంతరం గుడి మూసివేసిన విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయం గోపురంపైకి ఎక్కిన నినాదాలు చేశాడు.. వెంటనే గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది.
రాష్ట్రపతి భవన్‌లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ఉద్యాన్ ఉత్సవ్ రెండవ ప్రదర్శన జరగనుంది.
కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.