తెలంగాణ గడ్డపై పొడుస్తున్న కొత్త పొత్తులు.. టార్గెట్ బీజేపీయేనా?

Publish Date:Feb 9, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు దగ్గరవుతున్నాయా? రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు  చేతులు కలుపుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అంతే కాదు ఈ రెండు పార్టీల కలయిక వెనక బీఆర్ఎస్  పోషిస్తున్న పౌరోహిత్యం పాత్రను కూడా కొట్టి వేయలేమని రాజకీయ  పరిశీలకులు తాజా పరిస్థితులు, పరిణామాలను విశ్లేషిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో లౌకికవాద పార్టీలన్నీ ఎన్నికలకు ముందు ఏక తాటిపైకి వచ్చినా రాక పోయినా, ఎన్నికల తర్వాత  అవసరాన్ని బట్టి  ఖాయంగా ఒకటవుతాయని అంటున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచే స్కెచ్  సిద్దం చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని కలిశారని, అలాగే  అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం జుగల్బందీకి కూడా సెక్యులర్ సంబంధాలే  కారణమని అంటున్నారు.  

నిజానికి రాష్ట్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీనుందా అంటే  లేదు. కానీ, రాష్ట్రంలో బీజేపీ చాప కింద నీరులా బలాన్ని పుజుకుంటోందనే అనుమానం అయితే బీఆర్ఎస్ సహా బీజేపీ ప్రత్యర్హ్ది పార్టీలు అన్నిటినీ వెంటాడుతోందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సిపిఐ, సిపిఎం పార్టీలు ఏ విధంగా అయితే, మతోన్మాద బీజేపీ ఓడించడం కోసం అంటూ బీఆర్ఎస్ తో చేతులో కలిపాయో,  రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం సహా బీజేపీ యేతర పార్టీలన్నీ లౌకికవాదం కోసం ఒకటైనా ఆశ్చర్య పోనవసరం లేదని  పరిశీలకులు భావిస్తున్నారు. 

రాష్ట్రంలో బీజేపీ బలం పరిమితమే అయినా, అధికార బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీలన్నీ బీజేపీనే బూచిగా చూస్తున్నాయి. ఒక విధంగా భయపడుతున్నాయని అంటున్నారు. అందుకు ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉండడం ఒక కారణం అయితే, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమవడం మరొక కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో రోజు రోజుకు మరింత బలహీనమవుతోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలలో అధిక సంఖ్యాకులు కాళ్ళ పారాణి ఆరక ముందే అధికార పార్టీలో చేరిపోవడంతో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం బలపడుతోంది. అయినా ఇప్పటికీ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చును కానీ, ముందు ముందు బీజేపీ బలం పుంజుకుంటే... అనే ఆలోచనతో బీజేపీ యేతర  పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చేదుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.  

ఈ నేపథ్యంలో ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారని. అంటున్నారు. అయితే, ఇది రాజకీయ భేటీ కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నా, అంతకు ముందు రోజే జూనియర్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య  అసెంబ్లీలో హాట్ హాట్ గా నడిచిన పరస్పర విమర్శల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆలాగే, ఈ సంవాదం సందర్భంగా ఒవైసీ ఉద్దేశ పూర్వకంగా అన్నారో  వ్యూహత్మకంగానే అన్నారో గానీ, ఈసారి ఎన్నికల్లో 50 స్థానల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని, కనీసం 15 మందిని గెలిపించుకుంటుందని అన్నారు. ఆ వెంటనే 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్ కే ఉంటుంది అన్నారు. మరోవంక అక్బరుద్దీన్‌తో భేటీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలోమాట మాట్లాడారు.

ఎంఐఎం కూడా సెక్యూలర్ అంటుంది కాబట్టే తాము అక్బరుద్దీన్‌ను కలిశామని జగ్గారెడీ అంటే, అక్బరుద్దీన్‌తో జరిగింది రాజకీయ భేటీ కాదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని కాంగ్రెస్ నాయకులు కొంచెం చలా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. అదే సమయంలో ఈ భేటీలో  రాజకీయ అంశాలు చర్చకు రాలేదని భట్టి పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడంతో మంచి చెడు మాట్లాడుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ తమతో చెప్పారని తెలిపారు. పొత్తుల వ్యవహరం ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకోవసి ఉంటుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే, బీజేపీయేతర పార్టీలు సెక్యులర్ వేదికను సిద్దం చేస్తునట్లు ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.