తెలంగాణలో కొత్త పొత్తు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Publish Date:Feb 14, 2023

Advertisement

తెలంగాణలో రానున్న రోజులలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హస్తినలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది  తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో  ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఆయన కుండ బద్దలు కొట్టేశారు.

తెలంగాణలో బీజేపీ సంగతి పక్కన పెడితే సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ స్థానాలను సాధించే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని చెప్పారు.కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ సొంతంగా 60 స్థానాలు సాధించే పరిస్థితులు లేవన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హంగ్ అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. దీంతో అనివార్యంగా బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఎన్నికల ముందు ఎటువంటి పొత్తులూ ఉండే అవకాశం  లేదనీ, అయితే ఎన్నికల తరువాత మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలవక తప్పదని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గాడిన పడుతోందనీ, అయినా కూడా సొంతంగా 60 స్థానాలు సాధించే అవకాశాలు కనిపించడం లేదని కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర పేరుతో జనంలోకి వెళుతున్నారు. ఆయన పాదయాత్రకు విశేష జనస్పందన కనిపిస్తోంది.

అదే సమయంలో ఇంత కాలం రేవంత్ పై నిప్పులు చెరుగుతూ వస్తున్న సీనియర్లు ఇప్పుడిప్పుడే సమస్యలను, విభేదాలను పక్కన పెట్టి రేవంత్ తో అడుగులు కదుపుతున్నారు.  పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు (వీహెచ్) రేవంత్ తో కలిసి భద్రాచలం నియోజకవర్గంలో మంగళవారం (ఫిబ్రవరి 14)పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే బుధవారం (ఫిబ్రవరి 15) పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఆయన రేవంత్ తో అడుగులు కదపనున్నారు. ఇలా విభేదాలు మరచి రాష్ట్ర కాంగ్రెస్ లోని అన్ని వర్గాలూ ఐక్యమౌతున్నతరుణంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారానికి అవసరమైన 60 స్థానాలను సాధించలేదని కోమటి  రెడ్డి వెంకటరెడ్డి  ప్రకటించడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.