Publish Date:Jun 11, 2026
తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉండి.. ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకున్న కవిత.. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన విమర్శలపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. తాజాగా రెండు రోజుల కిందట హైదరాబాద్ లో కురిసిన వర్షానికి విశ్వనగరంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో గప్పాలు కొట్టుకున్న మహానగరం అతలాకుతలమైన సంగతిని ప్రస్తావిస్తూ.. నెటిజనులు టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధినేత్రి కవితను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
తెలంగాణ గడ్డపై భాగ్యనగరం విశ్వనగరంగా, గ్లోబల్ ఐటీ హబ్‌గా ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలతో హైదరాబాద్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కానీ, ఇంతటి మహానగరం ఒక్క అరగంట పాటు కురిసే వర్షానికే కుదేలైపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ కవితను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతిని కవిత వరద ప్రాంతమంటూ ఎద్దేవా చేయడాన్ని తప్పుపడుతున్నారు. వానాకాలం వస్తే అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి సీటు కిందకు నీళ్లు చేరకుండా చూసుకోండి అంటూ ఇటీవల కవిత అవహేళన చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా.. వర్షాకాలం మొదలైతే అమరావతిలో ప్రయాణించడానికి పడవలు వాడాలా అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక్క గంట వర్షానికి ఐటీ కారిడార్ అంతా జలమయం కావడంతో.. నెటిజన్లు కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమెపై తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. పక్క రాష్ట్ర రాజధాని గురించి వెటకారాలు తరువాత.. ముందు మీ నగరానికి వర్షాల నుంచి రక్షణ కల్పించుకో కవితక్కా అంటూ ఓ నెటిజన్ సలహా ఇవ్వగా.. గత పదేళ్ల మీ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో మీరు చేసిన అద్భుతమైన అభివృద్ధి ఇదేనా? అంటూ మరో నెటిజనుడు నిలదీశారు.
ప్రత్యేక తెలంగాణ వస్తే బంగారు తెలంగాణగా మారుస్తామని మీ తండ్రి కేసీఆర్ చేసిన ప్రకటనల పరమార్థం ఇదేనా? ఇదేనా అంటూ మరి కొందరు ప్రశ్నించారు. వర్షం వస్తే ఇప్పుడు హైదరాబాద్‌లోనే పడవలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ పాత వీడియోలను, మీమ్స్‌ను షేర్ చేస్తూ కల్వకుంట్ల కవితపై నెటిజనులు విరుచుకుపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/netizens-troll-kalvakuntla-kavitha-36-222573.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.