రాజకీయం అంటే.. జగన్ నిర్వచనం.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!

Publish Date:Oct 10, 2023

Advertisement

అదేంటో పాపం సీఎం జగన్ బహిరంగ సభకి వచ్చి ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్.. ఒకటికి నాలుగైదు సార్లు చదువుకున్న స్క్రిప్ట్.. సభలో కూడా చూసే చదివినా అది తేడా కొట్టేస్తుంది. ఎవిరిథింగ్ ఈజ్ ఫైనూ అనుకున్నా జగన్ నోటి నుండి ఆ మాటలు రాగానే ఎక్కడివాళ్ళకి అక్కడే  చిర్రెత్తుకొస్తుంది. ఆ వీడియోలు కట్ చేసి మాంచి బ్యాక్ గ్రౌండ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ట్రోలింగ్ చేస్తుంటారు. తాజాగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా సీఎం జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెటిజన్ల చేతికి ఫుల్ స్టఫ్ ఇచ్చాయి. సభలో ఎన్నికలు, మ్యానిఫెస్టో, కార్యకర్తల నుండి నేతల వరకూ ఏం చేయాలో చెప్పిన జగన్.. యధావిధిగా ప్రత్యర్థులపై అదే ఊకదంపుడు విమర్శలు చేశారు. ఇక, కొత్తగా ఈ సభలో జగన్ రాజకీయానికి ఒక నిర్వచనాన్ని చెప్పారు.

రాజకీయం అంటే ఏంటో తెలుసా.. రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా నిలవడం.. మరణించిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా మనం కనిపించటడమంటూ సీఎం జగన్ సూత్రీకరించారు. నిజానికి జగన్ ఈ నిర్వచనం చెప్పిన తర్వాత సభలో ఉన్న వారెవరికీ ఆయన ఏం చెప్పారో  చాలా సేపటి వరకూ  అర్ధం కాలేదు.  దీంతో జగన్ దానిని ఇంకాస్త వివరించి చెప్పారు. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి గుండెలో కూడా ఉండటం తనకు తెలిసిన రాజకీయం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జగన్ ఏం చెప్పారో అర్ధం అయింది అన్నట్లు అందరూ చప్పట్లు కొట్టారు. అలా చప్పట్లు కొట్టకపోతే మళ్లీ చెబుతారనుకున్నారో ఏమో. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండటమే రాజకీయం అనే మాటను చెప్పేందుకు జగన్ అన్ని ఇబ్బందులు పడ్డారన్న మాట. ఇక పనిలో పనిగా మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడని, రాజకీయ చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాడని, అబద్ధాల్ని నమ్మొద్దని, మోసాలను నమ్మొద్దని పార్టీ క్యాడర్ ను కోరారు.

కాగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు అంత సులభంగా మార్చిపోలేరని.. ఆంధ్రా చరిత్ర ఉన్నన్నాళ్ళు, ఆయన పాలనను చూసిన ప్రజలు ఉన్నంత కాలం ఎవరూ మర్చిపోలేరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతలా ప్రజలను పీక్కుతిన్న ముఖ్యమంత్రి, ఇంతలా కక్షకట్టి పాలించిన నేత ఎవరూ ఉండరని, రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను, చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పాలించిన సీఎం బహుశా జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని, ఆలాంటి వ్యక్తిని ఎలా మర్చిపోతామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా ప్రజలపై ప్రేమతో పాలిస్తారు.. తన పేరు మర్చిపోకుండా మంచి పనులు చేయాలని చూస్తారు.. కానీ జగన్ మాత్రం తనను తప్పు అన్న వారిని లేకుండా చేయాలనీ చూస్తారని.. అలాంటి వ్యక్తిని ప్రత్యర్థులే కాదు   ప్రజలు కూడా అంత సులభంగా మర్చిపోలేరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇక అబద్ధాల్ని, మోసాలను నమ్మొద్దని  జగన్ చెప్పిన మాటపై కూడా నెటిజన్లు పెద్ద చర్చ పెట్టారు. నిజమే ఈ నాలుగేళ్ళ పాలనలో ప్రజలు అబద్దాలు, మోసాలు అంటే ఏమిటో తెలుసుకున్నారని, ఈసారి ఖచ్చితంగా ప్రజలు మోసపోరని పేర్కొంటున్నారు. అబద్దాల గురించి, మోసాల గురించి, నేరాల గురించి, అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని.. 16 వేల కోట్ల అవినీతి కేసులో ఉన్న వ్యక్తి 27 కోట్ల అక్రమ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నేరస్తుడిగా పేర్కొనడం, సొంత బాబాయ్ హత్యకేసులో నిందితులను కాపాడుతూ మోసపోకండని ప్రజలను కోరడం, మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, 45 ఏళ్లకు పెన్షన్ లాంటి ఎన్నో హామీలను ఇచ్చి గాలికి వదిలేసిన వ్యక్తి ఇప్పుడు అబద్దాలను నమ్మవద్దని కోరడం చూస్తుంటే ప్రజలంటే సీఎంకు ఇంత చులకనగా కనిపిస్తున్నారా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.