Publish Date:Feb 11, 2026
వైసీపీని 11 నంబర్ వదల నంటున్నది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచీ ఆ నంబర్ వింటేనే ఆ పార్టీ ఉలిక్కిపడుతోంది. 151 టు 11 గా ఆ పార్టీ తిరోగమన ప్రస్థానాన్ని నెటిజనులు అప్పట్లో ఓ ఆట ఆడుకున్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి గైర్హజర్ కావడాన్ని కూడా 11 అంకెను ప్రస్తావిస్తూ నెటిజనులు ఇప్పటికే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా 11వ తేదీనే ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు జగన్ తన బాయ్ కాట్ ను పక్కన పెట్టి తనతో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశాలకు హాజరయ్యారు. అవ్వడం కాదు.. ఆ 11 మందీ సభలో సరిగ్గా 11 నిముషాల పాటు ఉన్నారు. దీంతో మరోసారి జగన్ ను, వైసీపీని ఈ 11 నంబర్ తో నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఓ ఆటాడుకుంటున్నారు.
నిజానికి తాను తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతానంటూ జగన్ ప్రకటించిన తరువాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు సెటైరికల్ గా వారు 11 నిముషాలకు మించి సభలో ఉండరు అని జోక్ కూడా చేశారు. సరిగ్గా ఆయన అన్నట్లుగానే జగన్ తన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చి సరిగ్గా 11 నిముషాల సేపు సభలో ఉండి కొన్ని నినాదాలు చేసి వాకౌట్ చేశారు. వైసీపీ అధినేత జగన్, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వాకౌట్ చేయడం అన్నది.. తమ శాసనసభ సభ్యత్వాలను కాపాడుకోవడానికి రిజిస్టర్ లో సంతకం చేయడానికేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అది పక్కన పెడితే 11 నంబర్ తో జగన్ ను నెటిజనులు చేస్తున్న ట్రోలింగ్ తో ఆయనకు పదకొండు సంఖ్య అంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఆ సంఖ్య కనిపించినా, వినిపించినా భరించ లేకపోతున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు వస్తే.. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతాయని నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచీ వైసీపీని నెటిజనులు ట్రోలింగ్ తో తెగ టీజ్ చేస్తున్నారు.
మళ్లీ వచ్చింది 11 అంటూ ఎద్దేవా చేశారు. అక్కడితో ఆగకుండా.. సభా సంప్రదాయలను ఒకింత పక్కన పెట్టి బుధవారం (ఫిబ్రవరి 11) అంటే 11 తేదీనే గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటూ చిలిపిగా ప్రభుత్వానికి సూచనలు చేసి జగన్ ను వేరే రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇక బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకూ జరగనున్నాయి. అంటే పక్షం రోజులకు పైగానే.. మరి ఇప్పుడు జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ సభకు వచ్చి తమ వాణిని వినిపిస్తారా? బడ్జెట్ పై చర్చలో పాల్గొంటారా? అన్నది రానున్న రోజులలో తేలుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/netizens-troll-jagan-and-ycp-39-213878.html
Publish Date:Jul 10, 2026
ఈ ఏడాదే పాదయాత్ర ప్రారంభిస్తానని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.