మంత్రుల తిట్ల పురాణం వెనుక ఉన్నదెవరో తెలిసిందిలే..!

Publish Date:Dec 28, 2022

Advertisement

 జగన్ తొలి కేబినెట్‌లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ఎక్సెట్రా ఎక్సెట్రాలు.. అలాగే  మలి కేబినెట్‌లోని మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, గుడివాడ అమరన్నాథ్ వగైరా వగైరాలు.. ప్రెస్ మీట్ పెట్టి తిట్ల పురాణం వల్లించడం వెనుక  ఉన్నది ఎవరో   తెలిసిపోయిందని నెటిజన్లు సామాజిక మాధ్యమం సాక్షిగా స్పష్టం చేస్తున్నారు. 

వైయస్ జగన్ కేబినెట్‌లో ఆయా శాఖల మంత్రులుగా కంటే..  వీరంతా బూతులతోనే ఫేమస్ అయ్యారని  గుర్తు చేస్తున్నారు. అయితే సదరు మంత్రులు అలా మాట్లాడుతున్నా.... ముఖ్యమంత్రి వైయస్ జగన్ కానీ, ఆయన   సలహాదారులు కానీ.. ఏ రోజు ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు అంటూ వారిని వారించిన దాఖలాలు లేవని  అంటున్నారు. 

కానీ తాజా పరిణామాల నేపథ్యంలో వీరి వెనుక ఉన్న శక్తి, వ్యక్తి ఎవరన్నది తమకు అర్థమైందని వారు సోషల్ మీడియా సాక్షిగా చెబుతున్నారు. తాజా   జగన్ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ 250 రూపాయిలు పెంచిందని.... ఈ పెంపు 2023, జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని... అయితే ఈ పెన్షన్‌ అందుకొంటున్న వారికి 300 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు వచ్చినా.. అలాగే వెయ్యి చదరపు గజాల విస్తిర్ణంలో వారు నివాసముంటున్నా.. అలాంటి వారికి ఇకపై పెన్షన కట్ చేయాలంటూ జగన్ సర్కార్ స్సష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై ప్రతిపక్షాల నుంచే కాదు.. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెన్షన్‌ కట్ అంశంపై అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  తాజాగా ముఖ్యమంత్రి  జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో   అలా విమర్శించే వారిని  ప్రెస్‌మీట్ మరీ  తిట్టాలంటూ ఉన్నతాధికారులకు సీఎం సూచించడమే కాదు... అలా మాట్లాడితేనే కానీ ఈ విమర్శలకు పుల్ స్టాప్ పడదంటూ  క్లారిటీ సైతం ఇచ్చేశారని నెటిజనులు సోషల్ మీడియా సాక్షిగా వివరిస్తున్నారు.  దీంతో ఉన్నతాధికార గణమంతా.. ఒక్కసారిగా అవాక్కయిందని వారు పేర్కొంటున్నారు.  

ఈ తాజా సంఘటనతో నాటి నుంచి నేటి వరకు మంత్రుల తిట్ల  పురాణం వెనుక కర్మ.. కర్త.. క్రియ అంతా సాక్షాత్తూ వైసీపీ అధినేత, సీఎం జగనే ఉన్నారనే విషయం తమకు అర్థమైందని నెటిజన్లు అంటున్నారు. 

అయితే జగన్ ముఖ్యమంత్రిగా కొలువు తీరిన తర్వాత.. జగన్ పాలనపై మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లు విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలో వీరిపై జగన్ అదేశాలతోనే.. నాటి.. నేటి కేబినెట్ మంత్రులంతా బండ బూతులు తిట్టారని, ఇప్పటికి వీరు తీడుతూనే ఉన్నారని అంటున్నరు. అయితే ఇటీవల విశాఖలో అధికార పార్టీ సింహ గర్జన నిర్వహించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్.. విశాఖకు వస్తున్నారు. ఈ సందర్బంగా స్థానిక ఎయిర్ పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. అలాంటి వేళ.. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎయిర్‌పోర్ట్ సాక్షిగా చేసిన వెకిలి చేష్టల వెనుక సీఎం వైయస్ జగన్ ఉండే ఉంటారని కూడా అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.