వచ్చిందమ్మా వీరనారి..!

Publish Date:Jul 7, 2023

Advertisement

వాసిరెడ్డి పద్మ.. తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం (జూలై 5) మహిళ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడలో సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులు అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వాసిరెడ్డి పద్మ ఈ సదస్సులో  సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న వారిని రోడ్డుపైకి లాగి తంతామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దాడి, అసభ్యకర యుద్దానికి సీఎం కుటుంబంలోని మహిళలు బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రతీ శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవంగా పాటిస్తామని స్పష్టం చేశారు. ఎవరినైనా లక్ష్యంగా చేయాలనుకుంటే వారి కుటుంబంలోని మహిళలను బయటకు లాగి ఆశ్లీల చిత్రాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని వివరించారు. బయట సమాజంలో ఇలా మాట్లాడితే రోడ్డుపైనే తంతారని చెప్పారు. న్యాయవ్యవస్థ, పోలీసులు ఈ సమస్య తీవ్రతను గుర్తించాలని సూచించారు. 

మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టాలంటేనే భయపడే రోజులు రావాలని వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా అసభ్యకర పోస్టులు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులను హత్యా నేరం కంటే తీవ్రమైనవిగా పరిగణించాలన్నారు. అయితే ఈ సదస్సుకు రాజకీయ పార్టీలను ఆహ్వానించ లేదని చెప్పారు.  

అయితే వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తనదైన శైలిలో స్పందించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత నిద్రలేచిన మహిళా కమిషన్.. వాసిరెడ్డి పద్మ అంటూ వ్యంగ్యంగా అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై దాడి అనేది ఆమెకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని తప్పులను ఎత్తి చూపితే సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని ఎవరు హననం చేస్తున్నారో వాసిరెడ్డికి పద్మకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల్లోని మహిళలను టార్గెట్‌గా చేసుకొని సమాజం సిగ్గుపడేలా ఎవరు పోస్టులు పెడుతున్నారో ఈ చైర్ పర్సన్‌కు అవగాహన లేదా అంటూ చురకలంటించారు. సోషల్ మీడియలో కూలీలను పెట్టి మరీ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారంటూ అధికార జగన్ పార్టీపై సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. 

మరోవైపు వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై  నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో ఓ మహిళ కమిషన్ ఉందని.. తామకు ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు. గత నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బండ బూతులు మాట్లాడారని.. ప్రతిపక్ష పార్టీల అధినేతలను వారి ఫ్యామిలీలను టార్గెట్‌గా చేసుకొని.. అటు మీడియాలో .. ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయారని.. నేటికీ సోషల్ మీడియాలో వారిని మానసికంగా దెబ్బ తీసేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా సాక్షిగా ఆడిస్తున్న తాంత్రిక యుద్ధ తంత్రం నీచంగా.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోనే విధంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందేనని.. మరి అప్పుడు స్పందించని ఈ మహిళా కమిషన్..? తాజాగా తెరపైకి వచ్చి.. అసభ్యకర యుద్ధానికి ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలు బాధితులవుతున్నారంటూ  పేర్కొంటున్నారని.. దీనిని ఎలా చూడాల్సి ఉందని నెటిజన్లు ప్రశ్నించారు.  

ఇంత కాలం.. వివిధ పార్టీల్లోని మహిళలు, ఆ పార్టీల అధినేతల ఫ్యామిలీలను టార్గెట్‌గా చేసుకొని.. సాగించిన ఈ యుద్ధంతో.. సదరు పార్టీల అధినేతల ఫ్యామిల్లోని స్త్రీల మనస్సులు ఎంతగా కలత చెంది కల్లోలంగా మారాయో.. ఓ  మహిళగా మీకు అర్థం కాలేదా? కనీసం ఓ మానవత్వం ఉన్న మనిషి అయినా.. ఆ నాడే మీరు.. మీ పెద్దరికాన్ని నిలుపుకున్నట్లుగా .. ఫ్యాన్ పార్టీలోని ప్రజా ప్రతినిదులను, లక్షలాది రూపాయిలు వెచ్చించి.. ప్రత్యర్ధి పార్టీలపై నిప్పు లేకుండానే పొగలు సృష్టించే సోషల్ మీడియా వింగ్‌ను సమావేశ పరిచి.. ప్రతిపక్ష పార్టీల అధినేతలే మన టార్గెట్.. అంతేకానీ వారి ఫ్యామిలీలు కాదు.. వారి జోలికి వెళ్లకుండా రాజకీయాన్ని రాజకీయంగా చూడడండంటూ ఓ పెద్దరికంతో కూడిన ఓ సలహా, ఓ సూచన నాడే మీరు చేసి ఉంటే.. నేడు.. మీరు .. ఇలా సీఎం కుటుంబంలోని మహిళలు బాధితులుగా మారుతున్నారంటూ.. ఇటువంటి సదస్సు ఏర్పాటు చేయడం.. ప్రతి శుక్రవారం శ్రావణ శుక్రవారంలా మహిళలను గౌరవించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి ఉండేవి కావని నెటిజన్లు ఈ సందర్బంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన.. నాటి నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టిన వాసిరెడ్డి పద్మ.. పవర్ పుల్ మహిళ కమిషన్ చైర్మన్ గిరి దక్కగానే.. మబ్బుల చాటుకు వెళ్లిన చంద్రుడిలా మారిపోయారని నెటిజన్లు 
సెటైర్లు వేస్తున్నారు.

అధికారం కోసం.. రాజకీయ పార్టీల నడుమ జరుగుతోన్న యుద్దానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. అసభ్యకర కథనాలకు వండి వారుస్తున్న సంగతి మీకు తెలినిది కాదనీ.. అందుకే ఈ సదస్సుకు రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదని.. వాటిని ఆహ్వానించి ఉంటే.. అధికార పార్టీ రంగు  బట్టబయలు అయి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా.. రాజకీయ పార్టీల మధ్య జరుగుతోన్న ఈ యుద్దంలో ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను పిలవడం ఎంత వరకు సబబు అని నెటిజన్లు ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మను ప్రశ్నిస్తున్నారు. 

సోషల్ మీడియో జరుగుతోన్న ఈ వ్యవహారంతో తమకు, తమ ప్రభుత్వానికి ఏ మాత్రం బంధం, అనుబంధం, సంబంధం లేదని.. ప్రజలకు ఓ క్లారిటీ ఇవ్వడం కోసం.. వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు ఈ వీరనారి వాసిరెడ్డి పద్మ.. ఐ ప్యాక్ అదేశంతో ఈ సదస్సు నిర్వహించినట్లుగా అర్థమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  

By
en-us Political News

  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.