Publish Date:Aug 12, 2022
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె అనంతపురం జిల్లాలో ఓ వివాహనికి హాజరై.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో కర్నూలు నగర శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఎడమ వైపు రెండు టైర్లు ఒక్కసారిగా బరస్టయ్యాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తమై.. కారు వేగాన్ని నియంత్రించడంతో.. పెను ప్రమాదం తప్పింది.
ఈ సంఘటన జరిగిన వెంటనే పలువురు విజయమ్మ క్షేమంగా ఉన్నందుకు ఊపిరి పీల్చుకుంటూనే ఆమెకు అంత పెద్ద ప్రమాదం ఎదురు కావడం పట్ల ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొత్త కారు అదీ ఖరీరైన అత్యాధునిక హంగులు ఉన్న కారుకు ఒకే సారి రెంటు టైర్లు బరస్ట్ కావడమేమిటన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కొనుగోలు చేసి ఇంకా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తికాని కారు టైర్లు రెండు ఒకే సారి బరస్ట్ కావడంపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే కొనుగోలు చేసిన టొయోటా వెల్లిఫైర్ కారు ఖరీదు కోటిన్నర అని చెబుతున్నారు. అలాంటి కార్లకు అసలు టైర్లు పేలే అవకాశాలు అతి తక్కువ అని వివరిస్తున్నారు. అదీకాక ఇటువంటి ఖరీదైన కార్లు ముందుగానే అన్ని టెస్టులూ చేసి, సేఫ్టీ మెజర్స్ అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే డెలివరీ ఇస్తారని వాహన రంగ నిపుణులు అంటున్నారు. కొత్త టైర్లు బరస్టయ్యే అవకాశమే ఉండదనీ, అలాంటిది రెండు టైర్లు ఒకే సారి బరస్టవ్వడమేమిటని అంటున్నారు.
వైయస్ రాజశేఖరరెడ్డి భార్యగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మకు ప్రజల్లో గౌరవ ఉంది. ఆమె కుమారుడు వైయస్ జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మకు రక్షణగా ఓ ఎస్కార్టు వాహనం అయినా ఉండాలి.. లేకుంటే.. ఆమె భద్రత కోసం కనీసంలో కనీసం ఇద్దరు పోలీసులు అయినా ఉండాలని అయితే ఆమె ఎటువంటి భద్రతా సిబ్బందీ వెంట లేకుండా కేవలం ఇద్దరితో మాత్రమే ప్రయాణించడం పట్ల నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు ఏపీ కేబినెట్‌లోని మంత్రులకు జగన్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అలాగే ఎమ్మెల్యేలకు సైతం గన్‌మెన్లను కేటాయించింది. ఎస్కార్ట్ కూడా కేటాయించింది. మరి అలాంటప్పుడు.. మాజీ సీఎం వైయస్‌ఆర్ భార్యగా, ప్రస్తుత సీఎం వైయస్ జగన్‌కి తల్లిగా.. ఓ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వైయస్ విజయమ్మకు ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయమ్మ కారుకు జరిగిన ప్రమాదం తీరును గమనిస్తుంటే ఆమె ప్రణాలకు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/netizens-express-doubts-about-vijayamma-car-accidents-39-141820.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.