Publish Date:Jul 24, 2024
జగన్ చీకటి పాలన తొలగిపోయి దగ్గర దగ్గర రెండు నెలలు కావొస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులలో చాలామంది ఇంకా అంధకారంలోనే వున్నారు. ఇంతకాలంలో చేయడానికి పనేమీ లేక టైమ్‌పాస్ చేసిన అధికారగణం, ఇప్పుడు ఒళ్ళు వంచి పనిచేయాల్సి రావడంతో ఇబ్బంది పడిపోతున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టుగా పని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయాల్లో వున్న కొందరు అధికారులైతే, తాము సక్రమంగా పని చేయకపోగా, కొత్త మంత్రులను బోల్తా కొట్టించేలా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ ఘనకార్యాలకు సంబంధించిన వివరాలు అడిగితే పూర్తి వివరాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద అసెంబ్లీ లాబీల్లో మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను వెలికి తీస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన పనులు, దోపిడీపై అనేక మంది సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిపై సరైన సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచిస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చే అరకొర వివరాలు చూసి కొత్త మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. తమనే బోల్తా కొట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నాని అంటూ పలువురు మంత్రులు అసెంబ్లీలో చర్చించుకుంటున్నారు.
గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులిచ్చిన సమాచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రశ్నకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండా ‘‘అవును, కాదు, ఉత్పన్నం కాదు’’ అంటూ అధికారులు సమాధానమివ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలిపారు. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను పవన్ ఆదేశించారు.
అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపైనా అధికారుల సమాచారంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జగన్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎంత మాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారమిచ్చారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తిస్థాయి సమాచారం తనకు అందలేదని మంత్రి తెలిపారు. వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/negligence-of-andhra-pradesh-officials-39-181411.html
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.