నిందితులను వదిలేసి.. విద్యార్థులపై దాడుల : సీఎం రేవంత్..!

Publish Date:Jul 22, 2026

Advertisement

 

నరేంద్ర, ధర్మెంద్ర ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నారు..!

నీట్ పేపర్ లీక్ పై పోరాటం చేస్తున్న విద్యార్థులకు మద్ధతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే పాశవిక దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల పాశవిక దాడులపై కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ తో బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను అమ్ముకుని బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనకు రాజకీయాలకు అతీతంగా పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. 

ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సింది పోయి.. విద్యార్థులపై పాశవికంగా దాడి జరుపుతారా అంటూ ప్రశ్నించారు. విద్యార్థినులపై దుర్మారంగంగా  దాడి చేయడమే కాకుండా.. విద్యార్థుల తలలు పగలగొట్టారన్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండా పోయారని,  వారిని ఎక్కడికైనా తీసుకెళ్లారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా అని సందేహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని ఇంటి ముందు నిరసన చేపట్టారని, శాంతియుతంగా  నిరసన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పై పాశవికంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పాశవిక దాడితో రాహుల్ గాంధీ రక్తం నేలకు చిందిందని, దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని చెప్పారు. 

ఆంగ్లేయులతో పోరాడి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.  దేశం కోసం రక్తం చిందించిన గొప్పకుటుంబం ఇందిరమ్మ కుటుంబం అన్నారు. బాంబు దాడితో శరీరం ముక్కలైనా దేశ సమైక్యత కోసం ప్రాణాలిచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా సోనియా గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని, కనీసం మంత్రి పదవి తీసుకోలేదని తెలిపారు. మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేసి త్యాగనిరతిని చాటుకున్న గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గేను నియమించారు తప్ప పదవులు తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రజా స్వామ్యంలో  నిరసన తెలపడం అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కు అని, పేపర్ లీక్ పై పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రధాని  అడ్డుకున్నారని విమర్శించారు.
 
దేశాన్ని దోచుకుంటున్న నరేంద్ర, ధర్మేంద్ర...!

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బీఆరెస్ అధికారంలో ఉన్న సమయంలో 2019లో ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్  బినామీ సంస్థ గ్లోబరీనా సంస్థ అవకతవకలకు పాల్పడిందని గుర్తు చేశారు. ఆ సంస్థ 27 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొందన్నారు.   అనుభవం, అర్హత లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లతో ఆనాడు కేటీఆర్ తన బినామీ సంస్థ గ్లోబరీనాకు ప్రాజెక్టును అప్పగించిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పప్పులు ఉడకవని గ్లోబరీనా సంస్థ Coempt Education గా పేరు మార్చుకుని గ్లోబరీనా సంస్థ కేంద్రం వద్దకు వెళ్లింది. 

ఢిల్లీ బీజేపీ వాళ్లతో మాట్లాడుకుని వాళ్లకు కేటీఆర్ కాంట్రాక్టు ఇప్పించారు. నీట్ పరీక్ష నిర్వహించడంతో దొంగతనం చేయొచ్చన్న ధైర్యం వాళ్లకు వచ్చింది. CBSE లో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విద్యార్థులు నిరసన తెలిపారని, ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తొలగించకుండా విద్యార్థుల తలలు పగలగొట్టారని కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం తప్పుపట్టారు. నరేంద్ర, ధర్మేంద్ర ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని, దేశాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థులు, యువత పక్షాన నిలిచి మోదీపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అందరం కలిసి పోరాటం చేసి మోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు.

అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ..!

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్ లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఉదయం కొడంగల్ లోని నివాసంలో ఎస్ఐఆర్ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నేరుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరారు. రాహుల్ గాంధీపై జరిగిన దాడి చిత్రాలతో కూడిన బ్యానర్ తో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకలుతో కలిసి భారీ ర్యాలీతో కాలినడకన సీఎం అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గ ముఖ్యనాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NEET paper leak, Kodangal, Congress protest rally, BRS BJP conspiracy, Rahul Gandhi, Priyanka Gandhi, Globerina Company, Dharmendra Pradhan, Jantar Mantar

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.