నీట్ పేపర్ లీక్...సీబీఐ కేసు నమోదు

Publish Date:May 13, 2026

Advertisement

 

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ యూజీ  2026 పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారికంగా కేసు నమోదు చేసింది. భారత ప్రభుత్వ విద్య మంత్రత్వ శాఖపరిధిలోని ఉన్నత విద్యా విభాగం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే  నీట్ యూజీ 2026 పరీక్షను 03 మే 2026న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  నిర్వహించినప్పటికీ, పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కొన్ని పత్రాలు అనధికారికంగా చలామణి అవుతున్నాయని సమాచారం అందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస భంగం, దొంగతనం, సాక్ష్యాల ధ్వంసం వంటి తీవ్ర నేరాలతో పాటు అవినీతి నిరోధక చట్టం మరియు ప్రజా పరీక్షల అక్రమ నివారణ చట్టం 2024 కింద కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. పరీక్షా ప్రక్రియ యొక్క పవిత్రతకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపినట్లు అధికారులు చెప్పారు. అవకతవకల స్వభావం, పేపర్ లీక్ పరిధి, సంబంధిత వ్యక్తులు మరియు సంస్థల ప్రమేయాన్ని గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

By
en-us Political News

  
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తండ్రి తన తండ్రి నుంచి పొందిన ఆస్తిపై పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుందా స్వయంకార్జిత ఆస్తులు, పిత్రార్జిత ఆస్తుల మధ్య తేడాలను వివరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.