ఏపీలో అధికారం కూటమిదే.. తేల్చేసిన బీజేపీ

Publish Date:Apr 27, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు. బీజేపీకి అందిన నివేదిక ప్రకారం ఏపీలో తెలుగుదేశం కూటమి 145 అసెంబ్లీ, 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ ఫ్యాన్ కొట్టుకు పోతుందని5 పేర్కొన్నారు. 

సునీల్ బన్సల్ చెప్పిన సంఖ్యలు ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వెలువడిన సర్వేలను మించి ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎపీ ఎన్నికలపై దాదాపు 11 సర్వేలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సర్వేలూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదనే చెప్పాయి. ఇప్పుడు తాజాగా సునీల్ బన్సల్ కూడా అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైసీపీ కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కానీ బీజేపీపై చిన్న పాటి విమర్శకూడా చేయడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ చేసిన ప్రకటనను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముస్లింలను దగా చేయడానికి రెడీ అయిపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

పొత్తులో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం 144, బీజేపీ 10. జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. వీటిలో 145 స్దానాలలో కూటమి అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తున్నట్లుగా తమకు నివేదిక అందిందని సునీల్ బన్సల్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. అంటే మిగిలిన 30 స్ఖానాలనూ వైసీపీ కాంగ్రెస్ లు పంచుకుంటాయని భావించాల్సి ఉంటుంది.

అంటే ఎలా చూసుకున్నా వైనాట్ 175 అన్న ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి 30 కంటే తక్కువ స్థానాలే వస్తాయని సునీల్ బన్సల్ చెబుతున్నారు. ఇక  లోక్ సభ స్థానాలైతే మరీ కనాకష్టంగా రెండు కంటే తక్కువ వస్తాయని బీజేపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. సునీల్ బన్సల్ ప్రకటనపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 

By
en-us Political News

  
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మే9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న
ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ త‌న దైన స్టైల్‌లో ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూట‌మికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ స‌ర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు.
రాజ‌కీయంగా సీనియ‌ర్ కూడా అయిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి త‌న మార్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉంది. ముఖ్యంగా ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ ఆయ‌న నేర్పుగా ముందుకు సాగుతార‌నే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
Publish Date:May 8, 2024
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.