జులై 18న ఎన్డీయే పక్షాల మీటింగ్.. ఓటమి భయంతో దిగొచ్చిన మోడీ సర్కార్

Publish Date:Jul 7, 2023

Advertisement

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరౌతున్న కొద్దీ బీజేపీలో కంగారు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.  2014 ఎన్నికలలో  విజయంపై విశ్వాసం అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు పెద్ద పీట వేసింది. ఆ పార్టీల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించింది. రాష్ట్రల ప్రయోజనాలను పరిరక్షిస్తూ దేశ ప్రగతిలో వాటినీ భాగస్వామ్యం చేస్తామని నమ్మబలికింది.

అయితే ఆ ఎన్నికలలో ఎన్డీయే కూటమి పక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం రావడంతో బీజేపీ ధోరణిలో మార్పు వచ్చింది. అయినా మోడీ తొలి కేబినెట్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి నుంచే భాగస్వామ్య పక్షాలను బలహీనం చేయడం అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం వంటి బలమైన ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయడం అది కుదరకపోతే ఎన్డీయేలోంచి పొమ్మనకుండానే పొగపెట్టి.. అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో విపక్షాలు బలపడేందుకు అన్ని విధాలుగా దోహదపడటం వంటి చర్యలకు పాల్పడింది. 2019 ఎన్నికల సమయం వచ్చే సరికి ఎన్డీయే అనేది పేరుకు మాత్రమే అన్నట్లుగా మిగిలింది.

ఆ ఎన్నికలలోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవరి మీదా ఆధారపడకుండానే సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఇక అక్కడి నుంచీ బీజేపీ విస్తరణ కాంక్ష పెచ్చరిల్లింది. రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే రాజకీయానికి తెరతీసింది. బలమైన ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాటికి ఆర్థిక చీకాకులు కలిగేలా వ్యూహాలు రచించి అమలు చేసింది.  ఫెడరల్ స్ఫూర్తిని తుంగలోకి తొక్కి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేందుకు కూడా వెరవకుండా ముందుకు సాగింది. ఇక ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ గత తొమ్మిదేళ్లకు పైగా ఉన్న మోడీ సర్కార్ పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను గుర్తించిన బీజేపీ హై కమాండ్.. మోడీ హ్యాట్రిక్ విజయానికి ఎన్డీయే పటిష్టంగా ఉండటం వినా మరో మార్గం లేదని గ్రహించింది. అందుకే ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 18న జరగనున్న ఈ సమావేశానికి పాత మిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిందని అంటున్నారు. అందులో భాగంగానే ఎబీజేపీతో విభేదించి గత ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసిన తెలుగుదేశంకి సైతం ఆహ్వానం పంపింది.  

మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేయలేదు. ఎన్నికల వేళ తన అవసరాల కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ కాక కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం.. దానికి తోడు బీజేపీయేతర పక్షాలన్నీ మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యం ఐక్యతారాగం ఆలపించడంతో వచ్చే ఎన్నికలలో గెలవాలంటే సొంత బలం చాలదన్న గ్రహింపునకు బీజేపీ వచ్చిందంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలతో పాటు పాత మిత్రులకూ, కొత్త మిత్రులకూ కూడా ఈ నెల 18న నిర్వహించనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది 

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.