తెలంగాణలోనూ ఎన్డీయే ప్రభుత్వం.. మోడీ వ్యూహం ఇదే!

Publish Date:May 12, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే  కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు.

తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..  ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.   గతంలో బీజేపీ,తెలుగుదేశం మధ్య విభేదాలు ఉన్నాయంటూ సాగిన ప్రచారానికి ఈ భేటీలతో ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యంగా ఏపీలో కూటమి విజయం తర్వాత, ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడబోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా కాకుండా..  మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేనలను కలుపుకొని ఎన్డీయే కూటమిగా ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు స్వయంగా వెళ్లడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.  

2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. ఎన్డీయే కూటమి పొత్తు అధికారికంగా లేకపోయినా..  టీడీపీ కేడర్ మద్దతు బీజేపీకి లభించడం వల్ల అక్కడ ఆ పార్టీకి ఎంపీ సీట్లు పెరిగాయని ఆయన విశ్లేషించారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీకి ఇప్పటికీ గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటే కూటమిగా వెళ్లడమే శ్రేయస్కరమని ప్రధాని మోదీ భావిస్తున్నారని అడుసుమిల్లి చెప్పారు. 

చంద్రబాబు నాయుడు, మోదీల మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ అవసరాల కోసమే కాకుండా..  రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా సాగుతోందని తెలుస్తోంది. కేంద్రం నుంచి అందుతున్న సహకారం..  పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు నిధుల విడుదల వంటివి రెండు పార్టీల మధ్య స్నేహాన్ని మరింత బలపరిచాయి. తెలంగాణలో కూడా ఒక సరైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి..  కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తే ఎన్డీయే కూటమి ఇక్కడ బలమైన శక్తిగా ఎదుగుతుందని అడుసుమిల్లి విశ్లేషించారు.  

By
en-us Political News

  
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.