గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై స్వతంత్ర దర్యాప్తునకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
Publish Date:Aug 12, 2022
Advertisement
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. తెలుగు రాష్ట్రాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్న మాటలు.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి రెండు సార్లు మీడియాతో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేకుండా ఉన్నాయని జనం అభిప్రాయపడుతున్నారు. అలాగే వారి మాటల్లోని తేడాను సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ఏకి పడేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈటెలలాంటి ప్రశ్నలు సంధిస్తూ వైసీపీపి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ లోని ఇద్దరు మహిళా మంత్రులూ కూడా గోరంట్లకు మద్దతుగా మాట్లాడటంతో నెటిజన్లు ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. అయినా జగన్ సర్కార్, వైసీపీ పార్టీ అంతా నాఇష్టం.. ఏం చేసినా అడిగేదెవరు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. అయితే ఇక గోరంట్ల వ్యవహారంలో ఇక ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో కేంద్ర పెద్దలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని హస్తిన నుంచి అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ప్రధానికీ, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూ లేఖలు రాశారు. అక్కడితో ఆగకుండా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కారణంగా ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అందరూ అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన పార్లమెంట్‌లో ఇటువంటి వ్యక్తులు అడుగు పెట్టడానికి అనర్హులని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గిల్ కోరారని అంటున్నారు. ఎంపీ గిల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పిందించి, న్యూఢ్ వీడియో కాల్ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాసినట్లు తెలిసింది. అలాగే ఈ వ్యవహారంపై స్వతంత్ర్య దర్యాప్తు జరిపి.. సాధ్యమైనంత త్వరగా మహిళా కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి రేఖా శర్మ లేఖ రాశారు. దీంతో జగన్ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీ అని చూసీ చూడనట్లు ఊరుకుందామనుకున్నా.. ఎదురుదాడితో ఈ వ్యవహారంలో విపక్షాల నోరు నొక్కుద్దామనుకున్నా ఇక వీలయ్యే అవకాశం లేదు. సాంకేతికంగా వీడియో ఒరిజనలా, ఫేకా అని తేల్చడం సాధ్యం కాదంటూ అనంతపురం ఎస్పీతో ప్రభుత్వం చెప్పించినా.. కేంద్రం తలచుకుంటే ఎస్పీ మాటల డొల్ల తనం కూడా వెల్లడైపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం న్యూడ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని నిగ్గు తేల్చాని బావిస్తే వైసీపీ బుకాయింపులకు అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీకి, జగన్ సర్కార్ లో మాధవ్ కు మద్దతుగా మాట్లాడిన వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/national-women-comission-orders-indipendent-probe-into-gorantla-nude-video-issue-25-141798.html