కేసీఆర్ అంటే జాతీయ నేతలు పరుగో పరుగు!

Publish Date:Aug 1, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలపై ఎంతగా మక్కువ పెంచుకున్నారో అంత కంటే ఎక్కువగా జాతీయ స్థాయి రాజకీయ నేతలు ఆయన పట్ల అంతగా అయిష్టత ప్రదర్శిస్తున్నారు. తరచూ జాతీయ రాజకీయ నేతలతో భేటీ అయ్యేందుకు ఆయన హస్తిన పర్యటనలకు వెళుతున్నా ఆయనను కలిసేందుకు మాత్రం పెద్దగా ఎవరూ మక్కువ చూపడం లేదు.

రాష్ట్ర పతి ఎన్నికల సందర్బంగా చివరి వరకూ తటస్థంగా ఉండి చివరి నిముషంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే కాకుండా ఆయన తరఫున ప్రచారం విషయంలోనూ అందరి కంటే తానే ఎక్కువ అన్నట్లుగా కేసీఆర్ తెలంగాణలో యశ్వంత్ సిన్హా కటౌట్లు పెట్టడం దగ్గర నుంచి భారీ ర్యాలీ వరకూ చేయాల్సింది, చేయగలిగింది అంతా చేశారు. సరే రాష్ట్ర పతి ఎన్నిక అయిపోయింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి పరాజయం పాలయ్యారు అది వేరే విషయం. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాలు మార్గరెట్ ఆల్వాను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాయి. ఆమె జయాపజయాల సంగతి ఎలా ఉన్నా.. మద్దతు కోరే విషయంలో కూడా తెరాస అధినేతను విపక్షాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. నాలుగు రోజుల పాటు హస్తినలో మకాం వేసి మరీ తన జాతీయ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకోవాలని ప్రయత్నించినా కేసీఆర్ ను కలిసేందుకు ఎవరూ సుముఖత చూపలేదు. పెద్దగా పట్టించుకోనవసరం లేని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మాత్రమే కేసీఆర్ తో బేటీ అయ్యారు. తెరాస ఆ భేటీనే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.

 ఆయన కాకుండా ఇతర పార్టీల నేతలెవరూ కేసీఆర్ తో భేటీ అయిన  ధాఖలాలు లేవు. హస్తినలోనే ఉన్న కేసీఆర్ ను ఉప రాష్ట్రపతి ఎన్నికలో మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వమని కోరడానికైనా ఎవరైనా కలుస్తారని భావించిన టీఆర్ ఎస్ నాయుకులు అందుకు కూడా ఎవరూ రాకపోవడంతో డిజప్పాయింటయ్యారు. టీఆర్ఎస్ అధినేత రెండు మెట్లు దిగి మరీ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ఆందోళనలు చేపట్టినా, విపక్షాలతో రాసుకుపూసుకు తిరగడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఆఖరికి  ఆర్జేడీ కూడా కేసీఆర్ తో బేటీకి సుముఖంగా లేదని తేలిపోయింది.  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కేసీఆర్ ను లైట్ తీసుకుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం  సానుకూలంగా సాగడంలేదు.   దీనికి తోడు యాంటి సెంటిమెంట్ కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల ఎంట్రీకి ప్రతిబంధకంగా తయారైంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నారు. అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందనీ అంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా కాలం కలిసి రాకపోతే.. అన్నట్లు ఉంది. జాతీయ రాజకీయాలంటూ ఆయన ఎంత హడావుడి చేసినా పెద్దగా మద్దతు రావడం లేదన్నది పక్కన పెడితే.. ఆయనతో రాజకీయంగా సన్నిహితంగా వచ్చిన వారందరికీ ఏదో రూపంలో  ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ (పీకే) నుంచి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వరకూ అందరూ ఏదో విధంగా ఇబ్బందులు పడ్డవారే. సినిమా పరిశ్రమ తరువాత సెంటిమెంట్లను ఎక్కవగా నమ్మేది రాజకీయ రంగంలోనే అంటుంటారు. అంతెందుకు స్వయంగా తెరాసయే సెంటిమెంట్ అస్త్రాన్నే రాజకీయ సోపానంగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత మరో సారి తెరాసను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి సెంటిమెంటునే ఆశ్రయిస్తున్నారు. అటువంటి కేసీఆర్ కు ఇప్పుడు జాతీయ రాజకీయ అరంగేట్రం వద్దకు వచ్చే సరికి అన్నీ యాంటీ సెంటిమెంట్ ఉదంతాలే ఎదురౌతున్నాయి.

గత రెండు ఎన్నికలనూ టీఆర్ఎస్ సొంత బలంతో ఎదుర్కొని తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయానికి వ్యూహరచన, పథకాల రూపకల్పన దగ్గర నుంచి ప్రచార సారథ్యం వరకూ అన్ని కేసీఆర్ తన భుజస్కంధాలపై మోశారు. ఒంటి చేత్తో పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గట్టెక్కించడానికి ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను ఆశ్రయించారు. పీకే కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పలు మార్లు కేసీఆర్ తో ప్రగతి భవన్ లోభేటీ అయ్యారు. అక్కడే మకాం వేసి మరీ చర్చలు జరిపారు. అక్కడి వరకూ బానే ఉంది. ఆ తరువాతే వ్యూహకర్తకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. పీకే రాజకీయ ఆకాంక్షలకు గండి పడింది. ఏదో ఓపార్టీ పంచన చేరి రాజకీయంగా చక్రం తిప్పుదామనుకున్నా ఆయన చేరదీసే వారూ, దగ్గరకు రానిచ్చే వారే కరవయ్యారు. తెలుగు రాష్ట్రాలు తప్ప ఎన్నికల వ్యూహాల కోసం పీకే వైపు చూసే వారే కరవయ్యారు. ఏ పార్టీ దరికి చేరనీయకపోవడంతో అని వార్యంగా సొంత రాష్ట్రానికి వెళ్లి అక్కడ ప్రాంతీయ పార్టీ ప్రకటన చేసి.. అక్కడకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. 

ఆ తరువాత వంతు రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్. రాకేశ్ టికాయత్ పరిస్థితి కూడా కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే అగమ్యగోచరంగా మారిపోయింది. మోడీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన బ్రహ్మాండమైన ఆందోళనకు నాయకత్వం వహించిన టీకాయత్.. ఆ ఆందోళనకు మోడీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి మరీ ఆ చట్టాలను ఉపసంహరించుకునేలా చేశారు. ఆ తరువాత కూడా ఆయన రైతు నాయకుడిగా తిరుగులేని ఆధిపత్యాన్నే అనుభవించారు. హైదరాబాద్ వచ్చి మరీ రైతు సభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల నిప్పులు చెరిగారు. అక్కడి వరకూ ఆయనకు  తిరుగేలేని పరిస్థితి ఎదురైంది. ఆ తరువాతే ఆయన సీఎం కేసీఆర్ తో హస్తినలో వేదిక పంచుకున్నారు. అక్కడ నుంచీ ఆయన కష్టాలు మొదలయ్యాయి.

కేసీఆర్ తో జత కట్టిన తరువాతే ఆయనకు అంత వరకూ సహచరులుగా ఉన్న రైతు నాయకులే ఆయనపై తిరుగుబాటు చేశారు. రాజకీయ పార్టీలతో, రాజకీయ నేతలతో అంటకాగుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయనపై దాడికి సైతం దిగారు. దీంతో ఇప్పుడు ఆయన వెంట రైతులు లేని పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆయనే కేసీఆర్ వెంట తిరుగుతున్న పరిస్థితి. దేశంలో రైతుల పరిస్థితి, కేంద్రానికి వ్యతిరేకంగా వారికి మరోసారి ఉద్యమ కార్యోన్ముఖులను చేయడం తదితర అంశాలపై ఇటీవల ఆయన కేసీఆర్ ప్రగతి భవన్ లో రెండు రోజులు బస చేసి మరీ ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పుడు తికాయత్ కు కేసీఆర్ వెంట నడవడం వినా మరో మార్గం కనిపించడం లేదా అని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు. 
ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.

జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా కేసీఆర్ బీజేపీయేతర కూటమి, జాతీయ స్థాయిలో మరో పార్టీ ప్రతిపాదనలకు ఇసుమంతైనా స్పందించని సమయంలో కేసీఆర్ తో కలిసి అడుగు వేయడానికి ముందుకు వచ్చారు హేమంత్ సొరేన్. హైదరాబాద్ వచ్చి మరీ కేసీఆర్ తో రెండు రోజులు మంతనాలు జరిపారు. పనిలో పనిగా తన సన్నిహిత బంధువు వైద్యం కోసం కూడా కేసీఆర్ సలహాను, సహాయాన్ని అందుకున్నారు. రాజకీయంగా కేసీఆర్ తో కలిసి అడుగులు వేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. అంత వరకూ బానే ఉంది. ఆ తరువాతే పరిస్థితి ఆయనకు ప్రతి కూలంగా మారింది.  మైనింగ్ లీజు, అలాగే ఒక ప్లాట్ ఆయ‌న భార్య‌పేరున రిజిష్ట‌ర్ చేయించుకున్నార‌న్న అవినీతి ఆరోపణలపై ఆయన నివాసం, ఆయన సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు జ‌రిగాయి.

ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి సోరేన్ స‌న్నిహితుడు, సాహిబంజ్ ఎమ్మెల్యే పంక‌జ్ మిశ్రా సంబంధించిన నివాసాల‌పై దాడులు నిర్వహించింది. అలాగూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇళ్లల్లో సైతం ఈడీ దాడులు నిర్వహించింది. మొత్తం18 ప్రదేశాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా హేమంత్ సొరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ అయిన తరువాత జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కేసీఆర్ తో రాజకీయంగా ఎలాంటి సాన్నిహిత్యమైనా తమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్న ఆందోళన రాజకీయ నాయకులలో వ్యక్తం అవుతోంది. కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే ఒకరి తరువాత ఒకరుగా ఇబ్బందుల్లో పడటం కాకతాళీయమే అయినా సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ రంగంలో ఇది కేసీఆర్ ను ఏకాకిగా మార్చే అవకాశాలే మిక్కిలిగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.