కేసీఆర్‌ని క‌లిశారు... చిక్కుల పాలయ్యారు!

Publish Date:Aug 27, 2022

Advertisement

కొంద‌రి క‌ల‌యిక అద్భుతం అంటారు, మ‌రికొంద‌రి క‌ల‌యిక ఎంతో మేల‌యిన‌దంటారు, కానీ కేసీఆర్‌తో భేటీ అయిన‌వారంతా రాజ‌కీయాల్లో ఊహించ‌ని షాక్‌లు తింటూండ‌టం గ‌మ‌నార్హం. ఇది యాదృచ్ఛిక‌మా, టీఆర్ ఎస్ అధినేత ఐర‌న్‌లెగ్ మ‌హ‌త్య‌మా అన్నది పక్కన పెడితే...  కేసీఆర్ కు రాజకీయంగా సన్నిహితం అవ్వడానికి ప్రయత్నించిన వారంతా ఏదో విధంగా చిక్కులలో పడుతున్నారన్నది మాత్రం వాస్తవం. 

మోదీ ప్ర‌భు త్వాన్ని గ‌ద్దె దించ‌డానికి కేసీఆర్  తాప‌త్ర‌యం, దూకుడుకు ఒక్క‌సారిగా బ్రేక్ ప‌డడానికి మాత్రం ఆయన వెనుక అడుగు వేయడానికి లేదా ఆయనతో కలిసి నడవడానికి ముందడుగువేసిన వారంతా ఇబ్బందులలో పడుతుండటంతో జాతీయ రాజకీయాలలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు చేసిన చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందాన సాగుతున్నాయి.  

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు కేసిఆర్ బీజేపీ మీద దూకుడుగానే ముందుకు వెళ్ళారు. కేసిఆర్ వెళ్లిన ప్రతి రాష్ట్రం లో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో అదరగొట్టారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ప్రచారంతో ఊదరగొట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అంచనాతో కేసిఆర్ కేంద్రం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇక తాను కలిసిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో కూడా బీజేపీ పతనం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావించి తనతో కలిసి రావాల్సిందిగా కోరారు. రాజకీయ వ్యూహకర్త పీకే సలహాలతో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ బీజేపీ ఓడుతుందని కేసిఆర్ వేసిన అంచనాలు తప్పాయి.

.సామాజిక న్యాయం, సమానత్వా న్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకు వచ్చేందు కు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్  ప్రయత్నాలు  చేశారు. జాతీయ స్థాయిలో పార్టీల నేతలు, పౌర సమాజ సభ్య లు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఉమ్మడి వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని భావించారు కేసీఆర్. ఈ లక్ష్యాలను సాధించే దిశగా అన్ని పార్టీల, వివిధ ప్రజా సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.  పీపుల్స్ ఫ్రంట్ అని సీఎం కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా కేసీ ఆర్ ఎన్డీయేతర నాయకులను వరసగా కలిశారు.  మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతోనూ మంతనాలు జరిపారు. కేసీఆర్. అటు మాజీ  ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కూడా  కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి ముచ్చ‌ట‌ప‌డ్డారు.

దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారని, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరా టం కొనసాగించాలని.. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కేసీఆర్‌కు ఉద్ధవ్ థాక్రే మద్దతు ప్రకటించారు. ముంబై వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని ఉద్దవ్ కోరారు. కానీ చిత్ర‌మేమంటే,  కేసీఆర్‌ను క‌లిసి చ‌ర్చించిన వేళావిశేష‌మేమోగాని, ఉద్ధ‌వ్ థాక్రే ఏకంగా సీఎం ప‌ద‌విని కోల్పోయి, అధికార నివా సం నుంచి స్వంత నివాసాన్ని చేరుకున్నారు. ఊహించ‌నివిధంగా బీ\జేపీ పావులు వేగంగా క‌దిపి థాక్రేకు షాక్ ఇచ్చింది. శివ‌సేన పార్టీలోనే అస‌మ్మ‌తి నాయ‌కుల‌ను ప్రోత్స‌హించి థాక్రేకు ఊపిరాడ‌నీయ‌కుండా చేసింది బీజేపీ. త‌న‌కు ప‌ద‌వుల మీద ఎన్న‌డూ ఆస‌క్తి లేద‌ని, ప్ర‌జ‌లు మా పార్టీని న‌మ్ముతున్నార‌ని, వారి అభిప్రాయాన్ని అంగీక‌రిస్తాన‌ని నిండు స‌భ‌లో ప్ర‌క‌టించి మ‌రీ గ‌ద్దె దిగారు.

 అలాగే  జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో కేసీఆర్‌ భేటీల తరువాతే  గనుల లీజు వ్యవహారంలో హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని..  కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనపై అనర్హత వేటు వేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేసీఆర్ తో భేటీ తరువాతే చిక్కుల్లో పడ్డారు. ఆమె కేబినెట్ లో  మంత్రి అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. అరెస్టయ్యారు. కనీసం ఆయనకు మద్దతుగా మమత చిన్న ప్రకటన కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు.  ఇక ఆప్ విషయానికి వస్తే కేసీఆర్ తో భేటీల తరువాతే ఆ రాష్ట్రంలో లిక్కర్ స్కాం వెలుగులోనికి వచ్చి ఆ కుంభకోణం కేసులో ఏకంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఏ వన్ గా ఈడీ కేసు నమోదు చేసింది.  కారణాలేమైతేనేం కేసీఆర్ తో రాజకీయంగా కలిసి నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వివిధ పార్టీల నాయకులు ఒకరి తరువాత ఒకరుగా చిక్కుల్లో పడటంతో ఆయనతో కలిసేందుకు, భేటీ అయ్యేందుకూ జాతీయ స్థాయి రాజకీయాలపై చర్చించేందుకూ కూడా పార్టీలనాయకులు భయపడుతున్నారు. రాజకీయ నేతలలో ఆయనది ఐరన్ లెగ్ అన్నముద్రపడిందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.