భార్యాభర్తల బంధాన్ని బిందాస్ గా మార్చే బ్యూటిఫుల్ డే..

Publish Date:Aug 18, 2023

Advertisement

ప్రేమ మన తెలుగు సినిమాల్లో, కథల్లో ఎంతో అందంగా చిత్రించబడుతూ ఉంటుంది. ఆ ప్రేమకి సరైన భాష్యం ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా మారడం. మనకి  వాలెంటైన్స్ డే గురించి తెలుసు. ప్రేమికుల ఆరాటం కూడా తెలుసు. ఆ ప్రేమ ఘాడతను వర్ణించడానికి మాటలు చాలవు. కానీ ఈ ప్రేమ ఒకటైనా మనుషులు మాత్రం సమాజం దృష్టిలో వేరుగానే ఉంటారు. ఈ ఇద్దరూ ఒకటైతే ఆవిష్కారమయ్యేదే దాంపత్య బంధం. భార్యాభర్తలను కపుల్స్ అని పిలవడం పరిపాటి. భార్యాభర్తలకు పెళ్లిరోజు తప్ప ఇంకేమీ ఉండవా? ఎందుకుండవ్? భార్యాభర్తలకోసం ప్రతి యేడు ఒక ప్రత్యేకమైన రోజుంది. అదే కపుల్స్ డే. బహుశా దీని గురించి తెలిసినవారు చాలా తక్కువ.  అంతెందుకు  భాగస్వామి గురించి కూడా పూర్తిగా తెలియని వారున్నారంటే ఆశ్చర్యం లేదు. ఆగస్టు 18వ తేదీని నేషనల్ కపుల్ డేగా జరుపుకుంటారు.  చాలా సార్లు  భాగస్వామి పుట్టినరోజు కానీ, పెళ్ళిరోజు కానీ మర్చిపోయి ఉండొచ్చు. బహుశా అది వారికి అంతో ఇంతో బాధను కలిగించి ఉండొచ్చు. ఆ బాధ మొత్తం మాయం చేయడానికి కపుల్ డే బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్కసారికి ఈరోజుని మర్చిపోకుండా మీ భాగస్వామికి సర్ప్రైజ్ ఇవ్వండి, మీరే ప్రపంచంగా జీవించే మీ భాగస్వామికి మర్చిపోలేని అనుభూతిని మిగల్చండి. 


ఒకప్పటి కంటే భారతదేశంలో ఒకరినొకరు ఇష్టపడి చేసుకునే పెళ్ళిళ్ళు ఎక్కువయ్యాయి. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా పెళ్ళి తర్వాత ఒకరి కోసం ఒకరు చేసుకునే అడ్జస్ట్మెంట్లు, బాధ్యతలు పంచుకోవడంతో బంధమే కాదు ఇద్దరి మధ్య ప్రేమ కూడా మరింత పటిష్టం అవుతుంది. మగవారు కూడా నేటి పరిస్థితులకి తగినట్టు మారుతూ ఉండడంతో చాలా జంటలు సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తున్నారు. మగవాడిని తల్లి తరువాత తల్లిగా చూసుకునే గొప్ప వ్యక్తి భార్యే.. కపుల్ డే రోజు భాగస్వామిని ఈరోజు బయటికి తీసుకెళ్ళి సంతోషపెట్టాలని ప్రతి భర్తకు ఉంటుంది. కానీ అది కదరచ్చు,  కుదరకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో  ఇంట్లోనే వారికోసం స్పెషల్ సర్ప్రైజ్ ఏర్పాటు చేయడం మగమహారాజుల చేతుల్లో పని.


భార్యను సంతోషపెట్టడానికి ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడవారి సంతోషం ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలోనే ఉంటుంది. ఎప్పుడూ ఆఫీస్ వర్క్ తో మీరు, ఇంట్లో పనితో మీ భార్య బిజీగా ఉంటే తనకోసం ఈ ఒక్కరోజు వంట చేయండి. వంట చేయడం రాకపోతే కనీసం నవ్వుతూ కబుర్లు చెబుతూ ఆమెకి వంటలో సహాయం చేయండి. ఇద్దరూ కలిసి వంటగదిలో చేసే వంట మంచి రొమాంటిక్ మీల్ గా మారిపోతుంది. 


ఒక మంచి మూవీకి తీసుకువెళ్ళండి. కుదరకపోతే పిల్లలు పడుకున్నాక మీ భాగస్వామితో ఇంట్లోనే మంచి రొమాంటిక్ మూవీ చూడండి. అదీ కుదరకపోతే కనీసం తనతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పండి. లేదా తన మాటల్ని శ్రద్ధగా వినండి. ఆ కొన్ని క్షణాల కబుర్లు చాలు. తన కలల ప్రపంచం మీ ముందుంటుంది. లేదా వారి ఆలోచనల లోతు తెలుస్తుంది. 


ప్రేమ ఒక దివ్యౌషధంలాంటిది. ప్రేమగా మాట్లాడే ఒక్క మాట ఇరువురిలోనూ ఒక రోజంతా ఉత్సాహంగా గడిపే శక్తిని ఇస్తుంది. ఒక చిన్న హగ్ శరీరంలో ఆక్సిటోసిన్ స్థాయిలు పెంచడంతో పాటు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.


పెళ్ళైన వ్యక్తులపై చేసిన ఒక పరిశోధనలో వాస్కులర్ వ్యాధి వచ్చే అవకాశం 12%తక్కువగా ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ఒక పరిశోధనలో ప్రేమించిన వ్యక్తి కళ్ళలోకి చూస్తున్నప్పుడు ఇద్దరి హార్ట్ రేట్ ఒకే విధంగా ఉన్నట్టు తేలింది.

ప్రేమించడం, ప్రేమను పంచుకోవడం వల్ల బంధం బలపడటమే కాదు, ఆరోగ్యం లాభాలు కూడా ఉన్నాయి మరి. ఇన్ని లాభాలు తెచ్చిన మీ భాగస్వామి తో ఈ కపుల్ డేని పైన చేపుకున్నట్టే కాదు, మీదైన శైలిలో, మీ కొత్త ఆలోచనలతో కూడా జరుపుకోవచ్చు. బంధాన్ని బిందాస్ గా మార్చుకోవచ్చు.

 

                                          *నిశ్శబ్ద.

By
en-us Political News

  
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.