నెహ్రూ కేవలం కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తే కాదు
Publish Date:Aug 27, 2018
Advertisement
ఢిల్లీలోని తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో మాజీ ప్రధాని నెహ్రూ మెమోరియల్ ఉంది.. ఈ కాంప్లెక్స్‌ను మాజీ ప్రధానుల మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు.. ఈ లేఖలో మన్మోహన్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. నెహ్రూ గొప్పతనాన్ని చెప్పటంతో పాటు, వాజ్‌పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం తీరు ఎలా ఉండేదో గుర్తు చేసారు. 'చరిత్ర, వారసత్వానికి గౌరవమిచ్చి జవహార్‌లాల్ నెహ్రూ మెమోరియల్ జోలికి వెళ్లకుండా వదిలేయండి.. నెహ్రూ కేవలం కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తే కాదు, ఈ దేశానికి ప్రధాని.. ఈ మెమోరియల్ భారత తొలి ప్రధానికి గుర్తు.. ఈ దేశం కోసం ఆయన ఎంతో కృషి చేశారు.. ఆయన గొప్పతనాన్ని ప్రత్యర్థులు కూడా మెచ్చుకున్నారు.. భాజపా అగ్రనేత వాజ్‌పేయి హయాంలోనూ ఈ మెమోరియల్ మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.. కానీ ఇప్పుడు ఈ మెమోరియల్‌ను మార్చాలని ప్రభుత్వం అజెండాగా పెట్టుకోవడం బాధాకరం' అని లేఖలో పేర్కొన్నారు.. అదే విధంగా నెహ్రూ మరణించిన సమయంలో వాజ్‌పేయీ పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని కూడా మన్మోహన్ లేఖలో ప్రస్తావించారు.. ‘పండిత్‌జీ మరణించిన సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్లమెంట్లో ఇలా అన్నారు.. తీన్‌మూర్తి కాంప్లెక్స్‌కు మళ్లీ ఎవరు వచ్చినా నెహ్రూ ఉన్నప్పుడు వచ్చినంత ఖ్యాతీ రాదు. ఆయన వ్యక్తిత్వం అజరామరం.. ప్రతిపక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చే తత్వం, హుందాతనం, గొప్పతనం మళ్లీ చూడలేమేమో.. ఆయన ఆదర్శాలు, ఈ దేశంపై ఆయనకున్న ప్రేమను మనమంతా గౌరవించాలి అని వాజ్‌పేయీ నెహ్రూను కొనియాడారు’ అని మన్మోహన్ గుర్తచేశారు.. సెంటిమెంట్‌ను గౌరవించి నెహ్రూ మోమోరియల్‌కు మార్పులు చేర్పులు చేయొద్దని మన్మోహన్ ప్రధాని మోదీని కోరారు.. మరి ఈ విషయంపై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
http://www.teluguone.com/news/content/narendra-modi-gets-tough-message-from-ex-pm-manmohan-singh-39-83265.html





