హరికృష్ణ జయంతి.. స్మరించుకొన్న నందమూరి, నారా కుటుంబాలు

Publish Date:Sep 2, 2023

Advertisement

తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీర్ కుమారుడు,  రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ 67వ జయంతి శనివారం(ఆగస్ట్ 2). ఈ   సందర్భంగా నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఘనంగా నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో మందికి హరికృష్ణ ఆత్మీయుడిగా నిలిచారని గుర్తు చేశారు. నిండైన తెలుగుదనానికి ప్రతిరూపంగా తెలుగువారి అభిమానాన్ని పాందారన్నారు. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ఈ మేరకు ట్విట్ చేశారు. 

అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం తన మావయ్య హరికృష్ణ జయంతి సందర్భంగా తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. హరి మామయ్య జయంతి సందర్భంగా ఆయన జ్జాపకాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదిలాయన్నారు. వెండితెరపై తన నటనతో అభిమానులకు ఆరాధ్య నటుడైన హరి మావయ్య డేరింగ్ పొలిటీషియన్ అని కొనియాడారు. అలంకరించిన పదవులకే వన్నె తెచ్చిన ఆయన తనకు నిత్య స్పూర్తి అని లోకేశ్ తెలిపారు. 

ఇక నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన తండ్రిని తలుచుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ఎమోషన్ అయ్యారు. ఆ క్రమంలో ట్విట్టర్ వేదికగా తన తండ్రి నందమూరి హరికృష్ణను స్మరించుకొంటూ వారు ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే అంటూ స్పందించారు.

1956, సెప్టెంబర్ 2న ఉమ్మడి కృష్ణాజిల్లాలోని  నిమ్మకూరులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు. 1996 - 1999 మధ్య చంద్రబాబు నాయుడు కేబినెట్ లో నందమూరి హరికృష్ణ.. రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత అంటే 2008 నుంచి 2013 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నందమూరి హరికృష్ణ చిన్నతనం నుంచే సినిమాల్లో నటించారు. బాలనటుడిగా  శ్రీకృష్ణావతారం, తల్లాపెళ్లామా, తాతమ్మ కల, రామ్ రహీం, దాన వీర శూర కర్ణలో నటించారు. ఆ తర్వాత శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో... సీతయ్య, టైగర్ హరిచంద్రప్రసాద్ తదితర చిత్రాల్లో కీలక భూమిక పోషించారు. 

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిట్టనిలువుగా చీల్చేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హరికృష్ణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నందమూరి హరికృష్ణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. 2018, ఆగస్ట్ 29న నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన మరణించారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.