అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా వేధిస్తున్నారు

Publish Date:May 19, 2020

Advertisement

విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్స్‌ పెట్టారంటూ గుంటూరులో ఓ వృద్ధురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు లోని లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన రంగనాయకమ్మ(66)కు సీఐడీ అధికారులు‌ నోటీసు అందజేశారు. విశాఖ‌ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రంగనాయకమ్మ అసత్య ప్రచారంతో పోస్టింగ్స్‌ పెట్టారని.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఆ పోస్టులపై ప్రాథమిక విచారణ జరిపి, వాటిని రంగనాయకమ్మ పెట్టినట్టు గుర్తించామని సీఐడీ అధికారులు తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41-ఎ ప్రకారం రంగనాయకమ్మకు నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే మొదటిసారి మూడేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా విధిస్తారన్నారు. అదే నేరాన్ని వారు మరోసారి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారన్నారు.

రంగనాయకమ్మపై కేసు నమోదు చేయడం పట్ల టీడీపీ నేత నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా  కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు. ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్ తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు." అని లోకేష్ విమర్శించారు.

"ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదో గొప్ప కంపెనీ అంటూ కితాబిచ్చారు జగన్. గ్రామస్తులు లేవనెత్తిన ప్రశ్నలనే సోషల్ మీడియా లో పోస్ట్ చేసినందుకు రంగనాయకమ్మ గారి పై కేసు పెడతారా?. " అని లోకేష్ ప్రశ్నించారు.

"66 ఏళ్ల వృద్ధురాలు పై కేసు పెట్టడం వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.మీ లెక్క ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష అయితే. 43 వేల కోట్ల ప్రజల సొమ్ము కొట్టేసిన జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యాలి?" అని లోకేష్ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.