నారా లోకేష్ డబుల్ సెంచరీ.. తెలుగుదేశం డబుల్ హ్యాపీ!

Publish Date:Aug 31, 2023

Advertisement

రాజకీయాలలో తొలి అడుగులు వేయకముందే.. తొక్కేద్దామని చూసిన వక్రబుద్ధి నేతల దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఎగసిన కేరటం నారా లోకేష్. బాడీ షేమింగ్ సహా, అహారపు అలవాట్లనూ గేలి చేసి రాజకీయంగా అణగదొక్కేయాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టి పరిణితి చెందిన నేతగా ఎదిగిన నాయకుడు నారా లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్న నిబద్దత గల కార్యదక్షకుడు నారా లోకేష్. నారా లోకేష్ ప్రస్తావనకు ముందు ఎందుకు ఇన్ని విశేషణలు అన్న ప్రశ్నకు ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.  నాలుగేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ  కక్షపూరిత రాజకీయాల కుతంత్రాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ, మూర్ఖత్వం మూర్తిభవించిన ప్రభుత్వాధినేత జగన్  తీసుకొచ్చిన విధానాలతో  విసిగిపోయిన ప్రజలకు అండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో కీలకమైన మైలురాయికి చేరుకుంది. గురువారం (ఆగస్టు 31)లోకేష్ పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. 

రాయలసీమలోని లోకేష్ స్వస్థలం కుప్పం నుంచి ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్‌ 200 రోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పర్యటిస్తున్న లోకేష్‌ ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 16 వందలకుపైగా గ్రామాలను, సుమారు రెండు వందల  మండలాలు, మున్సిపాలిటీలను కవర్ చేశారు. మొత్తంగా 200 రోజులలో 2,710 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సభలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల వద్ద సెల్ఫీలు దిగుతూ.. జగన్ సర్కార్ వైఫల్యాలను సమస్యలను ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా పరిష్కరిస్తాహామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

విపక్ష నేతగా జగన్  చేసిన పాదయాత్ర చూసిన వారంతా.. ఆ పాదయాత్రకు భిన్నంగా లోకేష్ కదులు తున్న తీరు చూసి అచ్చెరువోందుతున్నారు. నిబద్ధత, సంకల్పంతో  ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కనుగొనడం కోసం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న లోకేష్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  లోకేష్ పాదయాత్రలో కాళ్ల బొబ్బల కథలు లేవు.. వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్ మెంట్ల ప్రచారం లేదు. కాళ్లకు బొబ్బలని, చేతులకు గాయాలనే మెలో డ్రామాలు లేవు.  కావాలని ప్రత్యర్థులను తూలనాడి అల్లర్లు చేయడం అసలే లేదు.  పెయిడ్  ఆర్టిస్టులతో సెంటిమెంట్ పండించే టాలెంట్ కనిపించడం లేదు. పాదయాత్ర వెళ్లిన చోట పేదవాళ్ళు పెట్టే బుక్కెడు బువ్వను కడుపులోకి పోకుండా పెదవులను తాకించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే పాదయాత్రకు ఎక్కడా బ్రేకుల్లేవు. వీకెండ్ సెలవలు లేవు. కేవలం ప్రజల సమస్యలు ప్రస్తావిస్తూ, ఆ సమస్యలను సృష్టించిన ప్రభుత్వంపై  పదునైన మాటలతో  విమర్శలు చేస్తూ  లోకేష్ అధికార పార్టీ గుండెల్లో గుబులు రేపుతున్నారు.  లోకేషా.. పాదయాత్రనా అని ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే శభాష్ లోకేష్ అనిపించుకుంటున్నారు. 

ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పగలు పాదయాత్ర, సాయంత్రం సభ, విరామ సమయంలో నేతలు, కార్యకర్తలతో మాటా మంతీ.. ఇలా రోజంతా క్షణం తీరిక లేకుండా లోకేష్  పాదయాత్ర కు కొత్త నిర్వచనం చెప్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను వేధిస్తోందని తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని వదిలి పెట్టబోమంటూ హెచ్చరిస్తున్నారు. రెడ్‌ డైరీని పట్టుకొని వారి పేర్లు రిజిస్టర్ చేస్తున్నామంటూ ఊరూరా చెబుతున్నారు. మొత్తంగా పాదయాత్రకు ముందు లోకేష్ వేరు. పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. మాట తీరు మారింది.. నడవడిక మారింది. నేతలను ఆప్యాయం పిలవడం తెలిసింది.. ప్రజలకు అండగా ఉండడం తెలుసుకున్నారు. లోకేష్‌లో సరికొత్త రాజకీయ నాయకుడు కనపడుతున్నాడని రాజకీయ విశ్లేషకులే ప్రశంసలు గుప్పిస్తున్నారు.  

ఇక లోకేష్‌ పాదయాత్ర డబుల్ సెంచరీ రోజున టీడీపీ భారీ కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు. నేటి యువగళం పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబాలు పాల్గొననున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గం నుండి గురువారం ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి నరసన్నపాలెం, సీతంపేట, బయ్యనగూడెం, కొయ్యలగూడెం మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. భోజన విరామం తర్వాత గవరవరం, పొంగుటూరుల్లో లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. రాత్రికి పొంగుటూరు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

By
en-us Political News

  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.