కాలేజీలకు నూతన భవనాలు.. ప్రతి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ.!

Publish Date:Aug 19, 2026

Advertisement

ఏపీ ఎడ్యుకేషన్ సెక్టార్ లో  మౌలిక వసతుల కల్పన, గ్రంథాలయ వ్యవస్థ బలోపేతం తెలుగుదేశం కూటమి ధ్యేయమని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.   రాష్ట్ర వ్యాప్తంగా  37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాల నిర్మాణం, అలాగే రాష్ట్రంలోని  175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ  మోడల్  లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు  శసన సభ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీ   ప్రశ్నోత్తరాల సమయంలో  సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఆయన   ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థితిగతులపై  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు  ఆళ్లగడ్డ కళాశాలలో ప్రస్తుతం 103 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,  తగిన భూమి కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక నిధుల కేటాయింపు ద్వారా ఆ కళాశాలకు నూతన భవన నిర్మాణం, దెబ్బతిన్న కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకంతో పాటు ఎమ్మెల్యే కోటా నిధులు  ఉపయోగించి కంప్యూటర్లు, ల్యాబ్ పరికరాలు, బెంచీలను సమకూర్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సూచించారు.  

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి నారా లోకేష్.. ఒక్కో కళాశాల సకల సౌకర్యాలతో రూపుదిద్దుకోవడానికి  15 కోట్ల రూపాయలు  వ్యయం అవుతుందని, దశలవారీగా నిధులు విడుదల చేస్తూ అన్ని కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తామని వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు ఉంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోగలరన్నారు. 

గ్రంథాలయాల పునరుద్ధరణ అంశంపై  మంత్రి లోకేష్ సవివరంగా చెప్పారు.  కడప గ్రంథాలయ భవన నిర్మాణ పనుల ఆలస్యంపై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ,   9 నెలల  వ్యవధిలో ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.  వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..

మంగళగిరిలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీ  మంచి  ఫలితాలను ఇస్తోందన్నారు. వందలాది మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాత్రి వేళల్లో కూడా చదువుకునేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఇదే నమూనాను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ గ్రంథాలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు సభా ముఖంగా తెలిపారు. 

అమరావతిని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పుస్తక పఠన అలవాటు పిల్లల్లో సృజనాత్మక ఆలోచనా శక్తిని, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తుందన్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రతికూల ప్రభావాలు చూపుతున్న స్మార్ట్‌ఫోన్లు, టాబ్‌లకు పిల్లలను దూరం చేసి, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడంలో గ్రంథాలయాలు వంతెనగా పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

Nara Lokesh AP Assembly, 37 Government Degree Colleges AP, 175 Constituency Model Libraries AP, Amaravati World Class Central Library, AP Education Infrastructure News

By
en-us Political News

  
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.