విద్యాహక్కు చట్టం.. భారీగా పెరిగిన అడ్మిషన్లు.. మండలిలో లోకేష్.!

Publish Date:Aug 20, 2026

Advertisement

విద్యాహక్కు చట్టం  ఆర్టీఈ కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగిందని విద్యాశాఖమంత్రి నారా లోకేష్ అన్నారు.  శాసనమండలిలో ఆర్టీఈ కింద ఉచిత ప్రవేశాల అమలు తీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు.   పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన చదువు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్న ఆయన  ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ, నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు చేరువ చేయడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. 

విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు.

జగన్ హయాంలో  2022-23 విద్యా సంవత్సరంలో ఆర్టీఈ కింద కేవలం రెండు వేల పైచిలుకు మాత్రమే విద్యార్థుల నమోదు జరగగా,  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  బాధ్యతలు చేపట్టిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విద్యా సంవత్సరాల వారీగా అడ్మిషన్ల పురోగతిని సభ ముందుంచారు.  2024-25 విద్యా సంవత్సరంలో ఆర్టఈ కింద అడ్మిషన్లు  29 వేలు అన్నారు. ఆ తరువాత కూడా ఇదే వేగం కొనసాగిందని వెల్లడించారు. 2022 నుంచి ఇప్పటివరకు   ప్రైవేట్ బడులలో సీట్లు పొందిన పేద విద్యార్థుల సంఖ్య  లక్షా నాలుగు వేల 40 కు చేరుకుందని గణాంకాలతో వివరించారు.

అడ్మిషన్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలకు, సిఫార్సులకు తావులేకుండా ఉండేందుకు ఆన్‌లైన్ ద్వారానే నమోదు,  సీట్ల కేటాయింపు ప్రక్రియ  నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆయన.. సాంకేతికతను వినియోగించుకోవడం వల్ల అర్హులైన ప్రతి పేద విద్యార్థికి పారదర్శకమైన పద్ధతిలో అడ్మిషన్ దక్కుతోందన్నారు.   రాబోయే రోజుల్లో కూడా విద్యాహక్కు చట్టం నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేసి, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని సభకు హామీ ఇచ్చారు.

Nara Lokesh, RTE Admissions Andhra Pradesh, Education Minister Lokesh, Private School Free Admissions, AP Legislative Council News

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.