మంగళగిరిలో 3 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేశ్

Publish Date:Jul 21, 2026

Advertisement

 

మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భారీ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వేలాది పేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కులను కల్పించారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన 'మన ఇల్లు - మన లోకేశ్' కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేశ్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. సుమారు 3,000 మంది అర్హులైన పేదలకు రూ.1,000 కోట్ల విలువైన స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, పేదలకు ఇచ్చేది కేవలం ఒక కాగితం కాదని, తరతరాలకు అండగా నిలిచే శాశ్వత భూహక్కు అని పేర్కొన్నారు. నిరుపేదల ఆస్తులపై ఇకపై ఎవరూ కన్ను వేయలేరని, చట్టబద్ధమైన హక్కుల ద్వారా వారికి పూర్తి భద్రత లభిస్తుందని వివరించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆదాయం కంటే ఖర్చులు భారీగా ఉండేవని గుర్తుచేశారు. రూపాయి ఆదాయానికి రూపాయి అరవై పైసల ఖర్చు ఉండే పరిస్థితుల నుంచి, రెండేళ్ల ప్రణాళికాబద్ధమైన పాలనతో ఖర్చును రూపాయి నలభై పైసలకు తగ్గించగలిగామని తెలిపారు.

రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన ఉద్ఘాటించారు. పాలనలో సంస్కరణలు తీసుకువస్తూనే, పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.గత జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ, 2019 ఎన్నికల్లో తాను ఓటమి పాలైనప్పుడు కొందరు ఎగతాళి చేశారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఆ విమర్శలనే సవాలుగా తీసుకుని, మంగళగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చేందుకు పట్టుదలతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

రాబోయే రోజుల్లో మంగళగిరిని దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి మరిన్ని పథకాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.ఇళ్ల పట్టాలు పొందిన కుటుంబాల్లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చొరవతో నియోజకవర్గంలో ఉపాధి, రవాణా, పారిశ్రామిక రంగాలు మరింత పుంజుకుంటాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని లోకేశ్‌ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు లోకేశ్‌ తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Nara Lokesh, Mangalagiri House Titles, AP Coalition Government, Mana Illu Mana Lokesh, AP News Telugu, Deputy CM Pawan Kalyan, Visakhapatnam Railway Zone

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.