కష్టపడి చదవండి.. మీ కలల బాధ్యత నాది.. మంత్రి లోకేశ్ అభయం!

Publish Date:Jun 29, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయకూడదని, అలాంటి వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సదస్సులో వారి సమస్యలను, ఉన్నత ఆశయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ఈ వేదికపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా రాష్ట్ర విద్యా రంగంలోకి త్వరలోనే ‘ఏఐ ట్యూటర్’ (కృత్రిమ మేధస్సు ఆధారిత ట్యూటర్)ను తీసుకురాబోతున్నట్లు లోకేశ్ వెల్లడించారు. అలాగే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాన్ని తట్టుకునేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐ ల్యాబ్స్, ఫండమెంటల్స్‌పై శిక్షణ ఇస్తామని ప్రకటించారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు రాష్ట్రంలోని గ్రంథాలయాలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో లైబ్రరీలను బలోపేతం చేయడంతో పాటు, ఏడాది వ్యవధిలోనే రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్‌ను కూడా మంజూరు చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల వ్యక్తిగత గాథలు అందరినీ కదిలించాయి. తండ్రి అనారోగ్యం కారణంగా కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్న చాందిని అనే విద్యార్థినికి నీట్ కోచింగ్ ఇప్పిస్తామని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్న మనీష అనే బాలిక ఉన్నత చదువుల బాధ్యతను తానే చూసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు. బాల్యవివాహం అయినా పట్టుదలతో చదివి టాపర్‌గా నిలిచిన భాగ్యం అనే మహిళకు కూడా ఉన్నత చదువుల కోసం సాయం అందిస్తామని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూలు ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోకేశ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కేవలం బట్టీ పద్ధతికి పరిమితం కాకుండా అప్లికేషన్, క్రిటికల్ థింకింగ్ అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సమాజంలో శాశ్వత మార్పు రావాలంటే యువత మరియు చదువుకున్న విద్యార్థులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, వారి విద్యా అవసరాలకు మంత్రి లోకేశ్ తక్షణమే స్పందించి హామీలు ఇవ్వడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, పేద విద్యార్థుల కలల సాకారానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి చొరవలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

By
en-us Political News

  
సమాజంలో ఉన్నతమైన హోదాల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్ అధికారిణి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఈ ఫేక్ వీడియోలు ఉన్నాయంటూ తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో రెండు సార్లు విచారణకు హాజరు కావడానికి గడువు కాలాలంటూ కోరిన గుడివాడ అమర్నాథ్ ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే, మన దేశంలోని గోవా రాష్ట్రంలో ఉండే మొత్తం కుటుంబాల కంటే కూడా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఉపాధి కోసం ఎంతలా జనం ఇక్కడికి తరలివస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.
అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ 212.63 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో రికార్డు సృష్టించింది. రూ. 46 జీఎమ్‌పీతో జూలై 1న భారీ లిస్టింగ్ లాభాల అంచనాలు. పూర్తి వివరాలు మరియు అలాట్‌మెంట్ స్టేటస్ ఇక్కడ చూడండి.
జూలై 4 నుండి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు మరియు ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్లు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్‌ లీగ్ (EWCL) లోగో జూబ్లీహిల్స్‌లో ఘనంగా ఆవిష్కరించబడింది. ఆగస్టు 15 నుంచి 16 జట్లతో ప్రారంభం కానున్న ఈ లీగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
2026 ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్‌లో పెను సంచలనం నమోదైంది. బలమైన జర్మనీ జట్టుకు పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో 4 3 తేడాతో షాకిచ్చి లాస్ట్ 16కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) భారత ఫార్మా కంపెనీలు, కెమిస్ట్ అసోసియేషన్లపై దాఖలైన 14 ఏళ్ల నాటి యాంటీ కాంపిటీటివ్ కేసును కొట్టివేసింది. తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ వెలువరించిన ఈ కీలక తీర్పు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వల్ల డబ్బు ఆదా అవుతుందని అనుకుంటున్నారా అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే. మానవ ఉద్యోగుల కంటే ఏఐ నిర్వహణకే టెక్ కంపెనీలకు విపరీతమైన ఖర్చవుతోందని ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ మరియు ఎంఐటీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ఈవీ పాలసీ 2026 పూర్తి వివరాలు. మొదటి 1000 ఎలక్ట్రిక్ ట్రక్కులకు 10 ఏళ్ల నో ఎంట్రీ మినహాయింపు, కార్లపై రోడ్డు టాక్స్ రద్దు మరియు భారీ సబ్సిడీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బిట్‌కాయిన్ ధర మళ్లీ 60,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల మధ్య క్రిప్టో మార్కెట్ తదుపరి గమ్యం ఏంటి? నిపుణులు సూచిస్తున్న కీలక మద్దతు ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యూఏఈలో నివసిస్తున్న 35 లక్షల మంది భారతీయులకు అలర్ట్. జూలై 1, 2026 నుంచి భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు మరియు కొత్త సెంటర్ల నిబంధనల్లో కీలక మార్పులు వచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.