డాక్యుమెంటేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మంగళగిరి ప్రజల హృదయాలలో లోకేష్ స్థానం సుస్థిరం.!

Publish Date:Sep 28, 2026

Advertisement

2024 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత చారిత్రక తీర్పును వెలువరించింది. తెలుగుదేశం పార్టీ  అభ్యర్థిగా నారా  లోకేష్ ఇక్కడి నుంచి  92 వేలకు పైగా భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.  మూడు దశాబ్దాలకు పైగా టీడీపీకి అందని ద్రాక్షలా ఉన్న ఈ స్థానంలో, లోకేష్ అఘండ మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు అంటే 2019 ఎన్నికలలో లోకేష్ ఇదే స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. అయితే ఓటమి తరువాత.. నియోజకవర్గ సమస్యలపై ప్రజల తరఫున నిరంతరం గళం విప్పుతూ ప్రజాభిమానాన్ని చూరగొని ఎక్కడైతో పరాజయాన్ని ఎదుర్కొన్నారో అక్కడే తిరుగులేని విజయం సాధించి సత్తా చాటారు. 

గెలిచిన క్షణం నుంచీ లోకేష్ మంగళగిరి ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు.  స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.  మంగళగిరిలో   హౌసింగ్ డాక్యుమెంటేషన్ సమస్య నిన్న మొన్నటిది కాదు. దశాబ్దాలుగా తిష్ఠ వేసుకుని కూర్చున్న సమస్య. అటువంటి సమస్య పరిష్కారానికి నారా లోకేష్ నడుంబిగించి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. 

ఇక్కడ లోకేష్ గురించి చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది.    సురక్షితం కాదని తెలిసినా మంగళగిరి నుంచే 2019 ఎన్నికల మంగళగిరి బరిలో నిలిచారు. ఆ పరాజయం తరువాత కూడా వెన్ను చూపని లోకేష్ 2024 ఎన్నికలలోనూ మంగళగిరినే ఎంచుకుని పోటీ చేశారు. ఆ సందర్భంలోనే మంగళగిరిలో అపరిష్కృతంగా ఉన్న  హౌస్ డాక్యుమెంటేషన్ సమస్య పరిష్కరించాలన్న విజ్ణప్తి స్థానిక ప్రజల నుంచి బలంగా వినిపించింది. అయితే..  లోకేష్ ఈ విషయంలో అప్పుడు ప్రజలకు హామీ ఇవ్వలేదు.

 ఈ అంశంపై తనకు పూర్తి అవగాహన లేదని నిజాయితీగా ఒప్పుకుని, హామీ ఇవ్వలేనని విస్పష్టంగా చెప్పారు.  2024 ఎన్నికలలో విజయం తరువాత..  ఈ సమస్యకు సంబంధించిన పూర్తి అవగాహనకు వచ్చారు. అప్పుడు ఆయన విస్పష్ట హామీ ఇచ్చారు.  అర్హులైన ప్రతి  పేద కుటుంబానికి గృహ నిర్మాణ పత్రాలు అందిస్తామని  విస్పష్ట హామీ ఇచ్చారు. ఇప్పుు ఆ హామీని అంతే నిజాయితీగా పరిష్కరిస్తున్నారు.   ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ హౌసింగ్ డాక్యుమెంటేషన్ సమస్యను పరిష్కరించి మాట నిలబెట్టుకుంటున్నారు. 

ఇందులో భాగంగానే.. మంగళగిరిలో  హౌసింగ్ డాక్యుమెంటేషన్  పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. తద్వారా లోకేష్ మంగళగిరి ప్రజలకు మరింత చేరువ అవ్వడమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగేలా బలమైన పునాది వేసుకన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రజా సమస్యను పరిష్కరించడంలో చొరవ తీసుకున్న లోకేష్  మంగళగిరి ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.  


[Nara Lokesh, Mangalagiri housing Documentation, Promise, Mana Illu Mana Lokesh, AP Government Land Pattas, Permanent Title Deeds, Telugu One]

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.