నందమూరి వసుంధర ఆధ్వర్యంలో హిందూపురంలో కార్తీక మహోత్సవం

Publish Date:Nov 25, 2023

Advertisement

తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. అందులోభాగంగా  సోమవారం (నవంబర్ 27)సామూహిక కార్తీక వన భోజనాలు కార్యక్రమం జరగనుంది.  దాని కంటే ముందు అంటే  అదే  రోజు ఉదయం  చిలమత్తూరు మండలం దేమకేతుపల్లిలో  కొలువు తీరిన కనుమ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలోని శివాలయంలో అభిషేకం, బిల్వార్చన, తులసీ దామోదర పూజ  నిర్వహించనున్నారు.  

ఇక సాయంత్రం 5.00 గంటలకు లేపాక్షిలోని  లేపాక్షి దేవాలయంలో జరగనున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అంటే రాత్రి 7.00 గంటలకు హిందూపురం ముద్దిరెడ్డిపల్లిలోని శివాలయంలో సామూహిక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నందమూరి వసుంధర బాలకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  కార్తీక మహోత్సవ కార్యక్రమంలో మహిళలు, శివ భక్తులు, నియోజకర్గ ప్రజలు పాల్గొని ఆ పరమ శివుని దివ్య ఆశీస్సులు పొందాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు.

 నందమూరి బాలకృష్ణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినీ హీరోగా అభిమానులను అలరిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా   ప్రజా సేవలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో  అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయిలకే మంచి భోజనం అందిస్తున్నారు.  పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆరోగ్య సంజీవని పేరిట.. మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలయ్య బాబు.. మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే బాలయ్య ను ఓడించేందుకు జగన్ పార్టీ దీపిక అనే మహిళను హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది.   మరోవైపు బాలయ్య బాబును ఓడించేందుకు 2014 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్‌ను, అలాగే 2019 ఎన్నికల్లో మహ్మద్ ఇక్బాల్‌ను జగన్ పార్టీ బరిలో దింపినా... ఆయన విజయాన్ని అడ్డుకోవడం జగన్ పార్టీ వల్ల కలేదు.  దీంతో వచ్చే ఎన్నికల్లో దీపికను బాలయ్య బాబుపై పోటీ చేయించేందుకు జగన్ పార్టీ సన్నాహాలు చేస్తోంది.

అయితే వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొంది.. హ్యాట్రిక్ సాధించడం తథ్యమని తెలుగుదేశం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్తీకమాస మహోత్సవాన్ని నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురం నియోజకవర్గంలో నిర్వహించడం, ఈ కార్యక్రమానికి హిందూపురంలోని బాలకృష్ణ కార్యాలయం తరఫున అందరికీ ఆహ్వానం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.