ఖ‌మ్మం బ‌రిలో నంద‌మూరి సుహాసిని..? నామాకు బిగ్‌షాక్ ?!

Publish Date:Apr 1, 2024

Advertisement

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు పోటీలు పడుతున్నారు.  ఇప్ప‌టికే ప‌లువురు సిట్టింగ్ ఎంపీలు  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.  తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి, ఆయ‌న కుమార్తె క‌డియం కావ్య‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీలు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత ద‌గ్గ‌రి వ్య‌క్తిగా పేరున్న కె.కేశ‌వ‌రావుసైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి సుహాసిని సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు  రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది.  రెండు రోజుల క్రితం నంద‌మూరి సుహాసిని సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీల‌తో భేటీ అయ్యారు. కేవ‌లం మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ అని చెబుతున్న‌ప్ప‌టికీ.. ఆమె త్వ‌ర‌లో కాంగ్రెస్ గూటికి చేర‌నున్నారనీ,  ఖ‌మ్మం లోక్ సభ  నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నది.

సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా మే13న తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ స‌భ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ ఎస్‌, బీజేపీలు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా.. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ తోపాటు మరి కొన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి ఆశావ‌హుల సంఖ్య భారీగా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ్ముడు పొంగులేటి ప్ర‌సాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌తీమ‌ణి నందినితో పాటు మ‌రో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కుమారుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు కూడా ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి సుహాసిని పేరు తెర‌పైకి రావ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నంద‌మూరి సుహాసిని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా  తెలుగుదేశం అభ్యర్థిగా   కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేసి  ఓట‌మి పాల‌య్యారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవ‌ల ఆమె సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీని క‌లిశారు.   ఖచ్చితంగా రాజకీయ ఎజెండాతోనే సమావేశం జరిగి ఉంటుందని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ రాష్ట్రంలోని లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జిల‌ను ఆదివారం నియ‌మించారు. ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జిగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని నియ‌మించారు. దీంతో పొంగులేటి త‌మ్ముడు ప్ర‌సాద్ రెడ్డి పార్ల‌మెంట్ స్థానం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. అయితే, నంద‌మూరి సుహాసినీ పేరుకూడా అధిష్టానం ప‌రిశీల‌నలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఖ‌మ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఉమ్మ‌డి ఖ‌మ్మం  జిల్లాలో ప‌ది స్థానాల‌కు తొమ్మిది స్థానాల్లో విజ‌యం సాధించ‌డానికి తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల మద్దతే  ఓ కార‌ణమ‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లోనే కాుండా, ప్ర‌స్తుత  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో కూడా  తెలంగాణ‌లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది.  ఒక అంచనా ప్రకారం ఖ‌మ్మంలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌ మ‌ధ్య‌నే పోరు ఉండే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్   సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకే మ‌రోసారి టికెట్ కేటాయించింది. నామా నాగేశ్వ‌ర‌రావు  తెలుగుదేశం నుంచి వ‌చ్చిన వ్య‌క్తే కావ‌డంతో ఆయ‌నకు తెలుగుదేశం క్యాడ‌ర్ తో ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ క్యాడ‌ర్ తో పాటు, తెలుగుదేశం క్యాడ‌ర్ కూడా నామాకు మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో కేసీఆర్ నామాకే టికెుట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వ్యూహం మార్చి తెలుగుదేశం క్యాడర్ నామా వెంట వెళ్ల‌కుండా ఉండేందుకు నందమూరి  సుహాసినీని ఖ‌మ్మం బ‌రిలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

నందమూరి సుహాసినీని ఖ‌మ్మం బ‌రిలో నిలిపితే కాంగ్రెస్ క్యాడ‌ర్ తో పాటు టీడీపీ బ‌లం కూడా తోడ‌వుతుంద‌ని, త‌ద్వారా కాంగ్రెస్ విజ‌యం న‌ల్లేరుపై బండిన‌డ‌క అవుతుంద‌ని పార్టీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఇప్ప‌టికే ఖ‌మ్మం పార్ల‌మెంట్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నేత‌లే పోటీప‌డుతున్నారు. వీరంద‌రినీ కాద‌ని సుహాసినీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇస్తే.. పార్టీలో ఉన్న నేత‌ల స‌హ‌కారం ఎంత‌మేర‌కు ఆమెకు ఉంటుంద‌నేది కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే, నంద‌మూరి సుహాసిని తెలుగుదేశం పార్టీని వీడే అవ‌కాశాలు లేవ‌ని, కేవ‌లం  రేవంత్ రెడ్డితో నంద‌మూరి కుటుంబానికి ఉన్న సత్సంబంధాల కార‌ణంగానే మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఆమె సీఎంను క‌లిశార‌ని తెలుగుదేశం వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఖ‌మ్మం ఎంపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేంత వ‌ర‌కు ఇలాంటి ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తూనే ఉంటాయ‌ని ప‌లువురు పార్టీ సీనియ‌ర్ నేత‌లు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.