బీసీఐపై నిప్పులు చెరిగిన సీజేఐ.. నల్సార్ విద్యార్థులపై చర్య తీసుకోవద్దని ఆదేశం.!

Publish Date:Aug 14, 2026

Advertisement

నల్సార్  లా యూనివర్సిటీకి చెందిన 2026 బ్యాచ్ విద్యార్థుల న్యాయవాద ఎన్‌రోల్‌మెంట్‌పై విధించిన   నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) వెనక్కి తీసుకుంది. నల్సార్ లా వర్సిటీ  స్నాతకోత్సవానికి భారత్‌ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. వర్సిటీ  కాన్వొకేషన్ కు సీజేఐని ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి అందజేయడం సంచలనం సృష్టించింది. గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  దీనిపై సీజేఐ జస్టిస్ సూర్య కాంత్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే  హక్కు ఉందనీ ఆ హక్కు రాజ్యాంగమే కల్పించిందనీ పేర్కొంటూ.. , ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం బీసీఐకి లేదని కుండబద్దలు కొట్టారు. విద్యార్థిగా ఉండగా తాను కూడా శాంతియుత నిరసనల్లో పాల్గొన్నానన్న సీజేఐ, అయినా విద్యార్థులకు తనకూ మధ్య జరుగుతున్న వ్యవహారమనీ, ఇందులో బీసీఐ జోక్యం అనవసరమని పేర్కొంటూ..  విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణ లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు బీసీఐ  ఈ నిర్ణయంపై న్యాయవర్గాలతో పాటు సామాజిక మాధ్యమంలోనూ  విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం బ్యాచ్‌పై ఈ విధమైన సామూహిక శిక్ష విధించడం దారుణమని సీనియర్ అడ్వకేట్లు, న్యాయ నిపుణులు విమర్శించారు. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన   బీసీఐ  గురువారం (ఆగస్టు 13) సాయంత్రం అత్యవసరంగా సమావేశమై తన ఆదేశాలను వెనక్కు తీసుకుంది.   దీంతో నాల్సార్‌ నుంచి 2026లో పట్టా పొందే విద్యార్థులు తమకు నచ్చిన ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనైనా న్యాయవాదులుగా నమోదు చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది.  ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుతూనే, విద్యార్థుల స్వేచ్ఛను కాపాడటంలో సుప్రీంకోర్టు చూపిన చొరవ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

NALSARLawUniversity, BarCouncilof India, CJISuryaKant, BCIEnrollmentBan, HyderabadLawGraduates

By
en-us Political News

  
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నినాదించిన మన సభ.. జన సభ ఇప్పుడు మా అసెంబ్లీ ప్రజల అసెంబ్లీ అన్నఆయన ఆశయానికి సజీవ రూపంగా నిలవనుంది.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీలకు తావులేకుండా, దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లతో డిజైన్ చేశారు. కార్డు ముందరి భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్  ఆధారిత హోలోగ్రామ్ వంటి రక్షణ అంశాలను పొందుపరిచారు.
పుష్కరాల సందర్భంగా రాష్ట్ర  సాంస్కృతిక విశిష్టత, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమౌతోంది.  ఇందులో భాగంగా  సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమవేశమై ఏర్పాట్లపై సమీక్ష జరిపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.