స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్ గా సీజేఐ వద్దు.. నల్సార్ విద్యార్థుల అల్టిమేటమ్.!

Publish Date:Aug 10, 2026

Advertisement

హైదరాబాద్‌లోని   నల్సార్  లాయూనివర్సిటీ వార్షిక స్నాతకోత్సవ వేడుకలకు భారత ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పలకవద్దంటూ విద్యార్థులు గళమెత్తారు.   ఈ మేరకు వర్సిటీ యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చారు. నల్సార్ లావర్సిటీ స్న తకోత్వానికి సీజేఐ  భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయించింది.  సాధారణంగా దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తిని లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆహ్వానించడం  సహజం. ఆ వర్సిటీకి అది గర్వకారణం కూడా.  కానీ, నల్సార్ క్యాంపస్‌లోని  విద్యార్థుల  మాత్రం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి వీల్లేదంటూ వ్యతిరేకిండం కలకలం రేపింది. దాదాపు  వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి సమర్పించారు. 

కొన్ని కేసుల్లో   సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్‌   వ్యవహరించిన  తీరు తమను నిరాశకు గురిచేసిందని విద్యార్థులు ఆ లేఖలో  పేర్కొన్నారు. ముఖ్యంగా జులై 20న ఢిల్లీలో యువతపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన కేసుల విచారణ సంద ర్భంగా సీజేఐ తీరును ఆ లేఖలో ప్రస్తావిస్తూ.. ఆ కేసుల విచారణ సందర్భంగా విద్యార్థుల తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. అందుకు సంబంధిచిన  వీడియోలను చూపించేందుకు ప్రయ త్నించిన సమయంలో సీజేఐ సూర్యకాంత్‌ స్పందించిన తీరుపై ఆ లేఖలో విద్యా ర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

వీడియోల ప్రదర్శన సమయం వృధా అన్నట్లుగా సీజేఐ వ్యాఖ్యలు ఉన్నాయని ఆ లేఖలో విద్యార్థలు పేర్కొన్నారు.  న్యాయ విద్యార్థులుగా రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, న్యాయ ప్రక్రియ పై తమకు ఉన్న విశ్వాసా నికి ఈ వ్యవహారం విరుద్ధంగా ఉందనీ,  ఈ నేపథ్యంలో స్నాతకోత్స వానికి సీజేఐ సూర్యకాంత్‌ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని యూనివర్సిటీ యాజమాన్యం పునఃసమీ క్షించాలని వారా లేఖలో కోరారు.      

NALSAR Law University, CJI Surya Kant, NALSAR students letter, NALSAR convocation controversy, NALSAR Vice Chancellor, Supreme Court CJI invitation

By
en-us Political News

  
తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..!
ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..!
పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవా ల్లో కీలక ఘట్టమైన ఘటం ఊరేగింపు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..
“హలో సార్.. మేడమ్.. మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తక్కువ వడ్డీకే భారీ లోన్ మంజూరైంది
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం
శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్‌ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.