నల్లారి ఎక్కడున్నా అంతేనా?

Publish Date:Jun 7, 2023

Advertisement

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఏపీ రాజకీయాలలో గట్టిగానే వినిపించింది. పేరైతే వినిపించింది కానీ ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ విభజనను వ్యతిరేకించారు. అప్పట్లో సొంత పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి మరీ హస్తినలో విభజనకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. బెర్లిన గోడ కూల్చేసిన సందర్భంగా అందుకు సంబంధించిన అవశేషం అంటే ఓ రాయి ముక్కను చూపించి.. ఏపీ విభజన జరిగినా మళ్లీ రెండు రాష్ట్రాలూ కలిసిపోవడమే జరుగుతుందంటూ  అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగాలు కూడా చేశారు. అయితే విభజనను అడ్డుకోవడంలో విఫలమై.. కాంగ్రెస్ నుంచి వీడి సమైక్య ఆంధ్రప్రదేశ్ పేర సొంత పార్టీ పెట్టుకుని 2014 ఎన్నికలలో పోటీ చేశారు. ఘోర పరాజయం పాలయ్యారు.  ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఎవరూ కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇది పాత సంగతే. ఇక ప్రస్తుతానికి వస్తే.. 2014 ఎన్నికల పరాజయం తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా రాజకీయ అజ్ణాత వాసం చేశారు.  ఆ తరువాత తన సమైక్య ఆంధ్ర పార్టీ గురించి ప్రస్తావించకుండా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హస్తిన వెళ్లి కాంగ్రెస్ హై కమాండ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇక రాజకీయంగా ఆయన క్రియాశీలం అవుతారని అప్పట్లో అంతా భావించారు. కానీ ఆయన మాత్రం అజ్ణాతాన్ని వీడలేదు. తాజాగా ఇటీవల ఆయన కమలం గూటికి చేరారు. ఏపీలో కమలం పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను బీజేపీ ఆయనకు అప్పగిస్తుందని అప్పట్లో అంతా భావించారు. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేమీ జరగలేదు. పోలీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయినా బీజేపీ  కార్యక్రమాలలో ఏమైనా చురుకుగా పాల్గొంటున్నారా అంటే అదేమీ లేదు. పార్టీలో చేరినా ఇప్పటి వరకూ ఆయన హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కాలు బయటపెట్టిన దాఖలాలు లేవు. మధ్యలో ఏదో విదేశీ పర్యటన అంటూ వెళ్లారనీ, తిరిగి వచ్చిన తరువాత తడాఖా చూపుతారనీ వార్తలు వచ్చాయి. కానీ అదీ జరగలేదు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా హైదరాబాద్ లోని  నల్లారి కిరణ్ నివాసానికి వెళ్లి  కేంద్రంలో మోడీ సర్కార్ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా కోరినా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి స్పందన లేదని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తం మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ఆయన భాష మౌనమేననీ, ఆయన అజ్ణాత వాసేననీ సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి. 

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హఠాత్తుగా ఆయనను సోము వీర్రాజు హైదరాబాద్ ఇంట్లో కలిసి మోదీ తొమ్మిదేళ్ల పాలనపై విస్తృత ప్రచారం చేస్తున్నామని.. తమకు కూడా రావాలని ఆహ్వానించారు. అయితే కిరణ్ రెడ్డి మాత్రం హైకమాండ్ ఎలాంటి బాధ్యతలిచ్చినా చేస్తానని రొటీన్ డైలాగ్ చెప్పి పంపేశారు. ఆయన ఉద్దేశం.. హైకమాండ్ తనకు అర్జంట్ గా ఏదో ఓ పదవి ప్రకటించడం. కానీ కిరణ్ గురించి పట్టించుకునే తీరికలో ప్రస్తుతం హైకమాండ్ లేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సొంత పార్టీపెట్టుకుని కొన్నాళ్ల తర్తా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినా ఆయన ఏ పనీ చేయలేదు. ఏ పదవీ తీసుకోలేదు. ఆయన అంగీకరించి ఉంటే ఏపీ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చి ఉండేవాళ్లు. కానీ ఆయన తీసుకోలేదు. ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలా చేరిన తర్వాత ఆయన బయట కనిపించలేదు. వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిపోయారు. ఆయన పార్టీలో చేరినప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఆయన పాత్ర దగ్గర్నుంచి చాలా ప్రచారాలు జరిగాయి. కానీ జరిగింది మాత్రం శూన్యం. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో దక్షిణాదిన బీజేపీ పరిస్థితి తిరగబడింది. ఇప్పుడు ఆయన తన రాజకీయ నిర్ణయాల విషయంలో తననే కామెడీ చేసుకుంటున్నారేమో తెలియదు కానీ.. ఏపీలో జనంలోకి వెళ్లేందుకు మాత్రం ఆయన వెనుకడుగు వేస్తున్నారు. బీజేపీ తరపున ప్రచారానికి కూడా సిద్ధపడటం లేదు. పైగా ఏపీ బీజేపీలో ఉన్న వర్గాల కారణంగా ఆయనను కలుపుకునిపోవడం కూడా డౌటే. హైకమాండ్ సూచనల మేరకు సోము వీర్రాజు కలిసి ఉంటారని.. వాస్తవంగా అయితే ఆయన కూడా పట్టించుకోరని అంటున్నారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.