టీఆర్ఎస్ లో సాగర్ కిరికిరి?

Publish Date:Mar 24, 2021

Advertisement

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. నామినేషన్లు మొదలయ్యాయి. అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని తేల్చడం లేదు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుతో అభ్యర్థి ఎంపికకై ఆచితూచి అడుగులు వేస్తోంది గులాబీ పార్టీ. తమ సిట్టింగ్ స్థానమైన సాగర్ లో ఏ మాత్రం తేడా వచ్చినా.. పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అభ్యర్థి ఎంపిక కోసం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో పార్టీలో జోష్ వచ్చినా.. నల్గొండ జిల్లా నేతల మధ్య వర్గపోరు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. జిల్లా నేతలు ఏకతాటిపై లేకపోవడం వల్లే నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపిక కొలిక్కి రావడం లేదని చెబుతున్నారు. 

నాగార్జున సాగర్ టికెట్ విషయంలో నల్గొండ టీఆర్ఎస్ లో మూడు ముక్కలాట జరుగుతుందని తెలుస్తోంది. సాగర్​ టికెట్​ కోసం సీనియర్లు ఫైట్​ చేస్తున్నారని చెబుతున్నారు. యాదవ, రెడ్డి కులంలో టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్​లో యాదవ కులం ఓట్లు ఎక్కువుండగా.. రెడ్డి లీడర్లు బలంగా ఉన్నారు. దీంతో ఏ కులం వాళ్లకు టికెట్ ఇస్తే బాగుంటుదని నిఘా వర్గాల నుంచి కేసీఆర్​ ఇప్పటికే రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. యాదవ కులం నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్​తో పాటు గురువయ్య యాదవ్, ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నోముల కొడుక్కే టికెట్​ ఇవ్వాలని, సామాజికవర్గం ఓట్లతో పాటుగా సానుభూతి కలిసి వస్తుందని మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి పట్టుపడుతున్నారని చెబుతున్నారు. 

మంత్రి జగదీశ్​రెడ్డి మాత్రం రెడ్డి కులం నుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లను ప్రతిపాదిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. తన క్లాస్ మేట్ అయిన కోటిరెడ్డికి టికెట్ కోసం జగదీశ్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్​ .. తమ బంధువైన గురవయ్య యాదవ్​ కోసం సీఎం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో సాగర్ అభ్యర్థిని కేసీఆర్ ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. నల్గొండ జిల్లా నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని.. గుత్తా, మంత్రి జగదీశ్​రెడ్డితో పాటు జిల్లా నేతలను ప్రగతిభవన్​ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. 

మరోవైపు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను సాగర్ లో  మకాం వేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మండలానికో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించగా.. వారంతా అభ్యర్థి లేకుండానే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, పువ్వాడ అజయ్​, గంగుల కమలాకర్​ను సాగర్ లో మోహరించేందుకు గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారట. మంత్రులకు టార్గెట్​ పెట్టి ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పోల్ మేనేజ్ మెంట్ విపక్షాలకు చుక్కలు చూపించింది. దీంతో నాగార్జున సాగర్ పోల్ మేనేజ్ మెంట్ బాధ్యతలన్నీ పల్లాకే అప్పగించారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.