భ‌ర్త‌ అనుమానం... భార్య ప్రాణాల‌కే పెను ప్ర‌మాదం!

Publish Date:Aug 25, 2025

Advertisement

 

మొన్న‌టి వ‌ర‌కూ భార్య‌లు త‌మ ప్రియుళ్ల‌తో క‌ల‌సి భ‌ర్త‌ల‌ను హ‌త‌మార్చ‌డం ఒక రేంజ్ లోజ‌రిగింది. ఫ‌స్ట్ నైట్ రోజు, హానీ మూన్ రోజు, పెళ్ల‌యిన కొన్నాళ్ల‌కు ఇలా వ‌రుస ఉదంతాలు న‌మోద‌య్యాయి. ఒక స‌మ‌యంలో గ‌త ఐదేళ్ల‌లో 780కి పైగా భ‌ర్త‌లు త‌మ భార్య‌లు హ‌త‌మార్చ‌డం ద్వారా చ‌నిపోయిన‌ట్టు తేల్చాయి ఎన్సీఆర్ రికార్డులు. ఈ రివ‌ర్స్ మేనియా ఏంటో అర్ధం కాక ఒక్కొక్క‌రూ బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకున్నారు. కాలం మార‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుందేమో అనుకున్నారు.

ఇప్పుడిది య‌దాత‌థ స్థితి చేరిన‌ట్టు క‌నిపిస్తోంది. మ‌ళ్లీ భ‌ర్త‌లే భార్య‌లను అనుమానం కొద్దీ హ‌త‌మార్చే దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. అది కూడా ప్రేమించి పెళ్లాడిన త‌మ ప్రియ భార్యామ‌ణుల‌ను వ‌రుస పెట్టున హ‌త‌మార్చే ఘ‌ట‌న‌లు న‌మోద‌వుతున్నాయి. నాగ‌ర్ క‌ర్నూల్ కి చెందిన ఒక భ‌ర్త త‌న భార్యకు వివాహేత‌ర సంబంధం ఉంద‌న్న అనుమానంతో ఆమెపై పెట్రోలు పోసి త‌గ‌ల‌బెట్టేసిన ఘ‌ట‌న న‌మోద‌య్యింది. 

ప‌దేళ్ల క్రితం శ్రీశైలం- శ్రావ‌ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు కూడా. కానీ శ్రావ‌ణిపై శ్రీశైలానికి అనుమానం. దీంతో త‌ర‌చూ వేధించేవాడు. ఈ పోడు ప‌డ‌లేక శ్రావ‌ణి- శ్రీశైలం నుంచి విడిపోయి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఉంటోంది. అయినా స‌రే శ్రీశైలం వేధింపులు ఆగేవి కావు. అప్ప‌టికీ ఆమె మ‌హిళా పోలీస్టేష‌న్లో కంప్ల‌యింట్ చేసింది. అలాగ‌ని శ్రీశైలం ఆమెపై వేధింపులు ఆప‌లేదు. 

పెపెచ్చు చంప‌డానికి ప‌థ‌క‌ర‌చ‌న చేశాడు. ఈనెల 21న త‌న భార్య‌ను బైక్ పై సోమ‌శిల‌కు విహారంగా వెళ్లి వ‌ద్దామ‌ని తీస్కెళ్లాడు. ఆల్రెడీ త‌న వెంట  క‌త్తి, పెట్రోల్ తెచ్చిన శ్రీశైలం ఒక చోట ఆపి భార్య‌ను క‌త్తితో పొడిచి చంపి ఆపై పెట్రోలు పోసి త‌గ‌ల‌బెట్టేశాడు. త‌మ కూతురి జాడ క‌నిపించ‌క పోవ‌డంతో శ్రావ‌ణి త‌ల్లిదండ్రులు పోలీస్ కంప్ల‌యింట్ ఇవ్వ‌గా ఆ స‌రికే పోలీసుల‌కు లొంగిపోయాడు శ్రీశైలం.

మ‌హేంద‌ర్ రెడ్డి స్వాతిది మ‌రో ప్రేమ పెళ్లి విషాద‌గాథ‌. మ‌హేంద‌ర్ రెడ్డి- స్వాతి ఇరువురూ వేర్వేరు కులాల వారు. ఇరుగుపొరుగున వీరికి ప్రేమ క‌ల‌సింది. త‌ర్వాత పెద్ద‌లు ఒప్పుకోక‌పోయినా పెళ్లి చేసుకున్నారు. గొడ‌వ‌ల‌య్యాయి. పంచాయితీలు జ‌రిగి త‌ర్వాత ఇరువురికీ యాద‌గిరి గుట్ట‌లో మ‌ళ్లీ పెద్ద‌ల స‌మ‌క్ష‌లంలో పెళ్ల‌య్యింది. మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌ధాన అభ్యంత‌రం త‌న భార్య‌కు అప్పుడే క‌డుపు రావ‌డం. ఇది వ‌ర‌కే ఆమె గ‌ర్భం దాల్చ‌గా తీయించేశాడు. త‌ర్వాత కూడా ఆమె గ‌ర్భం దాల్చ‌గా దాన్ని కూడా వ‌ద్దంటాడు. దీంతో పారిపోయిన ఆమె పుట్టింటికి చేరింది. పెద్ద‌లు రాజీ చేయ‌డంతో మ‌ళ్లీ భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌. 

వినాయ‌క‌చ‌వితికి పుట్టింటికి వెళ్లి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటానంది ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అయిన స్వాతి. ఎంత‌కీ ఒప్పుకోలేదు మ‌హేంద‌ర్ రెడ్డి. ఇలాక్కాద‌ని స్వాతిని పూర్తిగా అడ్డు తొల‌గించుకోవాల‌నుకున్నాడు మ‌హేంద‌ర్ రెడ్డి. దీంతో ఎక్సా బ్లేడు వంటి ప‌రిక‌రాలు తెచ్చుకుని ఇంట్లో దాచి పెట్టాడు. కావాల‌ని భార్య‌తో గొడ‌వ పెట్టుకుని.. గొంతు నులిమి చంపేసి ఆపై ఆమె మృత‌దేహాల‌ను కండ‌కండాలుగా న‌రికేశాడు. ఆపై ఆ విడిభాగాల‌ను మూసీలో ప‌డేశాడు. 

ఆ త‌ర్వాత త‌న భార్య ఫోన్ నుంచి అంతా మంచేనంటూ ఆమె త‌ల్లిదండ్రుల‌కు మెసేజ్ లు పంపి అనుమానం రాకుండా చేశాడు. ఆపై ఆమె సోద‌రికి ఫోన్ చేసి, మీ చెల్లెలు క‌నిపించ‌లేద‌ని అన్నాడు. దీంతో ఆమె త‌న భ‌ర్త‌ను మ‌రిది వ‌ద్ద‌కు పంప‌గా.. అత‌డు కొంత సేప‌టి నుంచి స్వాతి క‌నిపంచ‌డం లేద‌ని అన్నాడు. ఇరువురు క‌ల‌సి పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి కంప్ల‌యింట్ చేశారు. పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అర్ధం ప‌ర్ధంలేని స‌మాధానాలు చెప్ప‌డంతో.. మ‌హేంద‌ర్ రెడ్డిని మ‌రింత  డీటైల్డ్ గా విచారించారు. క‌ట్ చేస్తే అస‌లు నిషం క‌క్కేశాడు మ‌హేంద‌ర్ రెడ్డి.

ఖ‌మ్మం జిల్లా మ‌ధిర‌లో మ‌రో ప్రేమ వివాహ విషాదగాథ‌. విజ‌య‌వాడ‌కు చెందిన సూర్య‌నారాయ‌ణ‌, మంగ‌ళ‌గిరికి చెందిన నాగ‌ల‌క్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఖ‌మ్మం వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. వీరికి ఇద్ద‌రు కొడుకులు. మూడో మారు నాగ‌ల‌క్ష్మి గ‌ర్భం దాల్చింది. అయితే త‌న భార్య‌పై అనుమానం పెంచుకున్న భ‌ర్త ఆమెను తాగేసి వ‌చ్చి వేధించేవాడు. అంతే కాదు ప‌నికి కూడా స‌రిగా వెళ్లేవాడు కాడు. 

అయితే అత‌డు భార్య‌పై పీక‌లోతు క‌క్ష పెంచుకుని ఆరోజు రాత్రి బాగా తాగేసి వ‌చ్చాడు. పిల్ల‌లిద్ద‌రూ నిద్రిస్తుండ‌గా.. ఆమెపై దాడి చేశాడు. ఆమె తీవ్ర ర‌క్త‌స్రావంతో పారిపోయంది నాగ‌ల‌క్ష్మి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను మ‌ధిర ఆస్ప‌త్రిలో చేర్చారు. అక్క‌డ ఒక ప్రయివేటు ఆస్ప‌త్రిలో ఆమె చికిత్స పొందుతుండ‌గా.. ప్ర‌స్తుతం నిందితుడు సూర్య‌నారాయ‌ణ మాత్రం ప‌రారీలో ఉన్నాడు. ఈ మూడు ఘ‌ట‌న‌ల్లో ముగ్గురిదీ ప్రేమ వివాహాలే. కానీ ఆ భ‌ర్త‌లు ఒక స‌మ‌యంలో త‌మ భార్య‌ల‌పై అనుమానం పెంచుకుని.. ఇదిగో ఇలా క‌డ‌తేర్చే య‌త్నం చేసిన ఉదంతాలు వెలుగులోకి వ‌చ్చాయి.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.