Publish Date:Oct 31, 2023
ఎన్నికల్లో టికెట్లు రాని అభ్యర్థులు పక్క పార్టీల వైపు చూడటం సహజం. దీన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ బిఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావ్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని మేము వదిలేసిన వారిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది అని ఆరోపణలు చేశారు. కానీ మంగళవారం కాంగ్రెస్ వదిలేసిన ఇద్దరు నేతలను బిఆర్ ఎస్ చేర్చుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కాంగ్రెస్ వదిలేసిన ఇద్దరు నేతలను బిఆర్ఎస్ అక్కున చేర్చుకుంది.
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి ఇవ్వాళ బీఆర్ఎస్ లో చేరారు. వారికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం, విష్ణువర్ధన్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి అధికార పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తన మిత్రుడు నాగం, యువనేత విష్ణువర్ధన్లకు మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నానన్నారు. నాగం జనార్దన్ రెడ్డి 1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో జైలుకు వెళ్లారని గుర్తు చేసుకున్నారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన అంగీకరించారన్నారు.
తెలంగాణ, హైదరాబాద్లోని సామాన్య ప్రజల కోసం పోరాడిన నాయకుడు పి. జనార్దన్ రెడ్డి అన్నారు. పీజేఆర్ వ్యక్తిగతంగా తనకు మిత్రుడని చెప్పారు. అలాంటి పీజేఆర్ తనయుడు బీఆర్ఎస్లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డిల భవిష్యత్తు... బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ దక్కపోవడంతో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nagam-and-pjr-son-join-in-brs-39-164316.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.