Publish Date:Apr 22, 2025
టీడీపీ అధికార ప్రతినిధి నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి వార్త నన్ను షాక్ కు గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు
Publish Date:Apr 22, 2025
ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారుఒంగోలు పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉన్న వీరయ్య పై దుండగులు దాడి చేశారు. ముసుగులో వచ్చిన దుండగులు వీరయ్య పై దాడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గాయపడ్డ వీరయ్యను చూసిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Publish Date:Apr 22, 2025
ఏపీ రాజ్య సభ విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఇవాళ కేంద్రమంత్రి అమిత్‌షాతో
సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు విషయంలో... టీడీపీ పార్టీ అలాగే జనసేన రెండు కాంప్రమైజ్ అయ్యాయి. ఏపీ రాజ్యసభ స్థానం బిజెపికి ఇచ్చేందుకు... టిడిపి అలాగే జనసేన రెండు పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బిజెపికి కేటాయించారు.ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో.. రాజ్యసభ అభ్యర్థి పై చర్చ జరిగింది. అమిత్ షా... నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ను కిషన్ రెడ్డి కూడా కలిశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమిళనాడు మాజీ బిజెపి అధ్యక్షుడు అన్నామలైను అభ్యర్థిగా నిలపబోతున్నట్టు అమిత్‌షా, చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తోంది.
Publish Date:Apr 22, 2025
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతు పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. స్ధానిక ఎమ్మెల్యే సంజయ్‌కి మా కంటే ఎక్కువ అనుభవం ఉందా? అని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డానని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలపై తాము నిరంతరం పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చామని అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ హస్తం పార్టీలో చేరడంతో కనీసం తన సంప్రదించకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కాంగ్రెస్ అధిష్టం జీవన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
Publish Date:Apr 22, 2025
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సౌదీ అరేబియా ప్రభుత్వం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. ప్రధాని విమానానికి ఇరువైపులా ఎస్కార్ట్‌గా వచ్చిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌లు ఆయనకు స్వాగతం పలికినట్లు విదేశాంగ శాఖ విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి గౌరవం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ప్రత్యేక స్వాగతం ఇరు దేశాల మధ్య, ముఖ్యంగా రక్షణ రంగంలో బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సౌదీ అరేబియా చేరుకున్నారు.
Publish Date:Apr 22, 2025
ఒకే ఒక్క మాటతో రాజకీయం తల్లకిందులు అయిపోయిన సందర్భాలు చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలోనూ చాలానే ఉన్నాయి. అయినా.. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు నోరు జారుతూనే ఉంటారు. ఇందుకో తాజా ఉదాహరణ తెలంగాణ పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్.
Publish Date:Apr 22, 2025
స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి. 2001లో ట్రైనీ ఐఏఎస్ గా కెరీర్ మొదలు పెట్టి.. బీఆర్ఎస్ హయాంలో సీఎంఓలో అపాయింట్ అయిన తొలి మహిళా ఉన్నతాధికారిణిగా ఆమెకున్న నేమ్ అండ్ ఫేమ్ నేషనల్ రేంజ్. ఒక సమయంలో ఆమె గురించి ఒక ఆంగ్ల పత్రికలో తప్పుడు కథనం ప్రసారమైందంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.
Publish Date:Apr 22, 2025
వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై పౌరసత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్ నెలలో చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
Publish Date:Apr 22, 2025
విజయసాయి రెడ్డి చెప్పినట్టు రాజ్ కసిరెడ్డి తెలివైన వాడే. ఆయన మద్యం డబ్బును ఎలా చేతులు మారుస్తారంటే.. రక రకాల విధానాల్లో వాటిని దారి మళ్లించి తిరిగి ఆ మొత్తం డబ్బును ఒక చోట చేర్చడంలో తన తెలివైన హైటెక్ బుర్రను వాడుతుంటారు.
Publish Date:Apr 22, 2025
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వేధించే విషయంలో తన పర బేధం లేదు. ఆయన హయంలో తెలుగుదేశం, జనసేన నేతలే కాదు, ఆయన సొంత పార్టీ అయిన వైసీపీ నేతలూ వేధింపులకు గురయ్యారు. అంతెందుకు సొంత చెల్లి, తల్లికి కూడా ఆయన నుంచి వేధింపులు తప్పలేదు.
Publish Date:Apr 22, 2025
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతతో తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ తగిలి సోమవారం ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొన్నాది. గరిష్ఠంగా 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Publish Date:Apr 22, 2025
ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షర్బత్ జిహాద్ అంటూ రాందేవ్ బాబా చేసిన కామెంట్స్‌పై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా హమ్దార్ద్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నెల ప్రారంభంలో బాబా రాందేవ్ పతంజలి గులాబీ షర్బత్‌ను ప్రారంభించినప్పుడు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీకు షర్బత్ ఇచ్చే కంపెనీ సంపాదించే డబ్బును మదర్సాలు, మసీదులను నిర్మించడానికి ఉపయోగిస్తారు. కానీ మీరు దీన్ని తాగితే (పతంజలి గులాబీ షర్బత్‌ను ఉద్దేశిస్తూ) గురుకులాలు నిర్మిస్తాం. ఆచార్య కులం అభివృద్ధి చెందుతుంది.
Publish Date:Apr 22, 2025
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ – 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే అనే అభ్యర్థికి మొదటి ర్యాంకు వచ్చింది. తెలుగు అభ్యర్థి సాయి శివాణికి 11వ ర్యాంక్ వచ్చింది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన 2,845 మందిని ఇంటర్వ్యూ చేసిన యూపీఎస్సీ ఇవాళ తుది ఫలితాలను ప్రకటించింది.