కర్నాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని కర్నాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో రాపిడో, ఊబర్ సహా అన్ని బైక్ ట్యాక్సీ కార్యకలాపాలు రాష్ట్రంలో నిలిచిపోనున్నాయి. ఇక పోతే మోటారు వాహనాల చట్టం కిందకు బైక్ ట్యాక్సీ సేవలను తీసుకు రావడానికి కర్నాటక ప్రభుత్వానికి కోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది.
మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 93 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించే వరకు బైక్ ట్యాక్సీలపై నిషేధం అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. తెలుపు నంబర్ ప్లేట్‌లతో కూడిన ద్విచక్ర వాహనాలను వాణిజ్యపరంగా వినియోగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karnataka-high-court-ban-bike-taxies-39-195544.html
పిఠాపురం వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపుతు తిరుగుతున్నాయి. గత ఎన్నికలలో కూటమి ధర్మానికి కట్టుబడి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ విజయానికి కృషి చేసిన పిఠాపురం వర్మ ఆ తరువాత జరిగిన పరిణామాల పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరులే కాకుండా పిఠాపురం తెలుగుదేశం క్యాడర్ కూడా చెబుతోంది.
వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని నిందితుడు. ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ సిఐడి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించింది.
వరుస భూకంపాలతో తైవాన్ బెంబేలెత్తిపోతున్నది. గత నెల 28న సంభవించిన భూకంపం సృష్టించిన విలయం నుంచీ, మారణహోంమ నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం (ఏప్రిల్ 9) మరోసారి తైవాన్ లో భూమి కంపించింది.
రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణలకు చెప్పాలని డిమాండ్ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది
జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. పాలిటిక్స్‌కు టెంపరరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు ఒక్కటొక్కటిగా అన్నీ కొలిక్కి వస్తున్నాయి. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పట్టాలెక్కనుంది.
ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో దారుణంగా నష్టపోతున్న రొయ్యాల రైతులు అక్వా సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆక్వా సంఘాలూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
మెట్రో రైలు ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని తెలంగాణ సర్కార్ తిరిగి అదే నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ బుధవారం (ఏప్రిల్ 9) ఉత్తర్వలు జారీ చేశారు.
ఎఐసిసి చీఫ్ మల్లి ఖార్జున్ ఖర్గే బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్ట పడి పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని నేతలపై చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమైంది. కష్టపడి పని చేసే వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు ఖర్గే చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి బుధవారం (ఏప్రిల్ 9) భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు.
కరుడుగట్టిన తీవ్రవాది తహవ్యూర్ రాణాను అమెరికా నుంచి రప్పించడంలో భారత్ విజయం సాధించింది. 2008 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అయిన తహవ్వూర్ రాణా గురువారం (ఏప్రిల్ 10) తెల్లవారు జామున అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకువస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
సింగపూర్ లో ఐసియులో కొడుకు మార్క్ శంకర్ ఉండటాన్ని చూసి ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుక్కున్న సంగతి తెలిసిందే.