నాగబూబుకు కేబినెట్ హోదాతో కీలక పదవి.!

Publish Date:Aug 17, 2026

Advertisement

జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.  ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం (ఆగస్టు 17) ఉత్తర్వులు ారీ చేసింది.  

రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ సమతుల్యత కాపాడటమే ధ్యేయంగా ఈ గ్రీన్ కార్యని ర్వాహక కమిటీ ఏర్పాటైంది.  రాష్ట్రవ్యాప్తంగా అడవుల విస్తీర్ణాన్ని పెంచే ప్రక్రియలో భాగంగా నాగ బాబు నేతృత్వంలో ఈ కమిటీ  ఏర్పాటైంది. నాగబాబు సారథ్యంలో గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  పర్యటించి,  పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న  కార్యక్రమాలు, మొక్కలు నాటే ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. అలాగే  వాటి పురోగతిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పర్యావరణానికి అనుకూలమైన విధానాలను రూపొందించడంతో పాటు ప్రకృతి వనరుల సంరక్షణకు అవసరమైన వ్యూహాలను అమలు చేయడంలో ఈ కమిటీ ప్రభుత్వం తరఫున పని చేస్తుంది.  రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, హరిత విప్లవం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంగా ఈ కమిటీ ఏర్పాటు, కమిటీ చైర్మన్ గా నాగబాబు నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.  జల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపొందించే దిశగా నాగబాబు ఎలాంటి చర్యలు చేపడతారనే అంశంపై వ్యాపకంగా ఆసక్తి నెలకొంది.

Naga Babu, AP Green Executive Committee, Andhra Pradesh Government, Cabinet Rank, Janasena Leader Naga Babu

By
en-us Political News

  
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.