గురుతర బాధ్యతగా స్వీకరిస్తున్నా.. ఎపి గ్రీన్ చైర్మన్ గా తన నియామకంపై నాగబాబు.!
Publish Date:Aug 17, 2026
Advertisement
జనసేన నియర్ నాయకుడు, నటుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదాతో కూడిన పదవిని కేటాయించింది. ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీ గ్రీన్) ఛైర్మన్‌గా నాగబాబును నియమించిన సంగతి తెలిసిందే. తన నియామకంపై స్పందించిన నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన సోదరుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు దక్కిన ఈ కేబినెట్ హోదా పదవిని కేవలం ఒక ప్రొటోకాల్ పదవిగానో గుర్తింపుగానో మాత్రమే భావించడం లేదన్న నాగబాబు.. ఈ పదవిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం తనపై ఉంచిన ఒక గురుతర బాధ్యతగా భావించి స్వీకరిస్తున్నానన్నారు. సాధారణంగా మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంపొందించడం అనేది తన వ్యక్తిగత జీవనశైలిలో భాగమనీ, ఇప్పుడు తన పదవి ద్వారా ఏపీని మరింత పచ్చగా, ఆరోగ్యవంతంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిదంచడం కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదనీ, ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్న ఆయన వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీనరీ పెంపు కోసం విస్తృతమైన ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. Naga Babu, AP Green Chairman, Cabinet Status, Pawan Kalyan Brother, Chandrababu Naidu, AP Politics, TeluguOne
http://www.teluguone.com/news/content/naga-babu-36-229140.html





