నాడీపతి  వైద్యం అంటే ...

Publish Date:Feb 22, 2022

Advertisement


నేడు సామాన్యులకు వైద్యం ఆర్ధికంగా భారంగా మారింది. మోయలేనిభారం కావడం తో ప్రజలు ప్రత్యామ్నాయ వైద్యం పై ఆధార పడుతున్నారు. ఈ ప్రక్రియలో శస్త్ర చికిత్స లేకుండా మందులు లేకుండా దీర్ఘ కాలిక వ్యాధులకు ప్రత్యామ్నాయ వైద్యం ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం లేదా ప్రత్యామ్నాయ వైద్యం పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపధ్యం లో నాడీ పతి వైద్యం చరిత్ర దాని ప్రాసస్త్యం  గురించి తెలుసుకుందాం.

నాడీ వైద్యం గురించి...

మన పూర్వీకులు ఒక సామెత చెపుతూ ఉండేవారు. ఆరోగ్యమే మహా భాగ్యము. అది మన దీర్ఘ కాలం జీవిం చేందుకు ఉపయోగ పడుతుంది. అని అంటారు. వ్యక్తి కి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకుంటే వృధా, కొందరికి అన్నీ ఉంటాయి అలాగే రోగాలు ఉంటాయి. కన్నీ అనారోగ్యం కారణం దేనిని అనుభవించ లేరు.ఇలాంటి దీర్ఘ కాలిక వ్యాధులకు మన పూర్వీకులు మనకు అందించిన  అత్యంత పురాతన వైద్యం నాడీ పతి అంటున్నారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.నాడీ పతిలో దాదాపు ౩౦౦ కు పైగా చికిత్సలు ఉన్నాయని అంటునారు వీటితో రిగాన్ని పూర్తిగా నయం చేయలేమని కేవలం ఉపసమనం కల్పించడం లేదా దీర్ఘకాలికంగా మార కుండా నియంత్రించ వచ్చని డాక్టర్ కృష్ణం రాజు వివరించారు. వాస్తవానికి మనం జీవితాన్ని అనందం గా విజయవంతంగా జీవించవచ్చు. అయితే మన శరీరం అలిసిపోతోంది.అనారోగ్యానికి గురి అవుతుంది. ఈ కారణంగానే మనిషికి జీవించడం కష్టంగా మారుతోంది.ఇందులో ఈ మధ్య కాలం లో ఎన్నోరకాల తెరఫీ విధానాలు అందుబాటులోకి రావడం తో తిరిగి మనజీవితాన్ని తిరిగి పొందవచ్చని నాడి పతి చికిత్స నిపుణులు   డాక్టర్ పి కృష్ణంరాజు తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు.

ప్రత్యామ్నాయ తెరఫీలలో హోమేయో పతి, అలోపతి, ఆయుర్వేద, యునాని పద్దతులు అందుబాటులో ఉన్నాయని.ప్రాచూర్యం పొందిన తెరపి పద్ద తులలో నాడీ పతీ ఒకటిగా చేపవచ్చని డాక్టర్ కృష్ణం రాజు వివరించారు.ఇతర ప్రభావ వంతమైన తెరఫీ అయినప్పటికీ పెద్దగా ప్రాచుర్యం లేకపోవదం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.కొన్ని వేల సంవత్సరాల క్రితం బౌతిక శరీరం అనారోగ్యానికి గురి అయినప్పుడు. వారు సూక్ష్మ శరీరానికి చికిత్స చేసేవారు. అప్పుడు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవారు.మళ్ళీ సూక్ష్మ శరీరామ్ వల్ల శరీరం తో ఏర్పడిన భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉండేది.సూక్ష్మ శరీరం 2,72,౦౦౦ నాడులతో తయారు చేయబడిందని వాటిని పరీక్షించిన తరువాతే  పాత వ్యాధులకు  నివారణ చికిత్స సాధ్యమని అన్నారు నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు  స్పష్టం చేసారు ఇటీవలి కాలం లో వ్యాధి ని పూర్తిగా నివారణ చేయాలంటే కేవలం నాడులను సరి చేస్తే చాలని అంటున్నారు అలాగే అన్ని వైద్య విధానాలాలో ఇచ్చినట్లుగా నోట్లో వేసుకునే మందులు ఇవ్వబోమని. ఇటీవలి కాలం నాడీ తెరఫీ ని ప్రత్యామ్నాయ చికిత్సగా పేర్కొనడం తో మనం మందుల వల్ల వచ్చే కొన్ని రకాల రీయాక్షన్స్ వస్తాయని నాడీ వైద్యంలో ఎలాంటి రీయాక్షన్స్ ఉండవని అంటున్నారు నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. నాడీ పతి ని అందుబాటులోకి తెచ్చినప్పుడు ఎన్నో సందేహాలు లేవనేత్తారని ఇదెలా సాధ్యమని కనుబొమ్మలు ఎగరేశారుతమలో తాము గోణుక్కున్నారని  అని అన్నారు.నేడు నాడిపతి ప్రత్యామ్నాయ వైద్యంగా ఎదిగిందని ఎలాంటి మందులు అవసరం లేకుండానే నాడీ పతి వైద్యం చేయవచ్చని అంటున్నారు డాక్టర్ పి కృష్ణం రాజు నాడీ వైద్యం లో షుమారు 18 సంవత్సరాల నాడీ వైద్యం అనుభవం గడించామని. మరెన్నో వ్యాధులకు నాడీ పతి లో పరిశోదనలు  చేపట్టినట్లు తెలుగు వన్ కి తెలిపారు.

నాడీ వైద్యం చరిత్ర...

నాడీ వైద్యం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప ప్రక్రియ గా పేర్కొన్నారు. కాగా కొన్ని6౦,౦౦౦ సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించే వారని ఈ భూమిపై జీవించేందుకు వారి వారి శరీరం పై ఏమాత్రం శ్రద తీసుకునే వారు కాదని. 4౦,౦౦౦ సంవత్సరాల తరువాత అంటే క్రీస్తు పూర్వం భారతదేశానికి చెందిన మునులు, సిద్ధులు,యోగులు, రెండు రకాల శరీరాలను కనుగొన్నారు. అది ఒకటి బౌతికమైనది,రెండవది సూక్ష్మమైనది గా పేర్కొన్నారు. బౌతిక శరీరం కనిపిస్తుంది. మరొకటి మనశరీరంలో 2,72,౦౦౦ నాడులు  బౌతిక దేహానికి అనుసంధానం చేయబడి ఉంటాయని తెలిపారు. నిపుణులు కనుగొన్న మరో అంశం ఏమిటి అంటే సూక్ష్మ శరీరం ఆధారం గా నే వీటి మధ్య తేడా తెలుస్తోంది. కాగా సూక్షం శరీరానికంటే ముందు బౌతిక శరీరం ముందుకు వస్తుంది ఈ పరిణామ క్రమం లోనే 72వేళా నాడుల తో పాటు ౦7 నాడులు చక్రాలు సూక్ష్మ శరీరంలో  ఉంటాయని కనుగొన్నారు. అలాగే వీటిని కలుపుతూ నాడీ కేంద్రాలు సూక్ష్మ శరీరానికి కలపబడి ఉంటాయి. అవి మన అరచేతులు మడమలు అరికాళ్ళలో అవి సమగ్రంగా  పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనశరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకుంటే మనం అనారోగ్యం పలు కాక తప్పదు.అని నిపుణులు అంటున్నారు.

వ్యాధి ఎలా విస్తరిస్తుంది...

వ్యాధి రెండుకార ణాలని తేల్చారు. రెండు మార్గాలలో వస్తుందని నిర్ధారించారు. వ్యాధి క్రమంగా పెరగడం, త్వరగా పెరగడం.

నాడీ వైద్యం మనదే అనేందుకు మన పురాణాలే సాక్ష్యం...

నాడీ వైద్యం మనదే అని మన పూర్వీకులు దీనిని కనుగొన్నారని దీనికి ఆధారం గా మన పురాణాలను ఆధారాలుగా చూపవచ్చని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు ఇందుకు ఉదాహరణ గా క్షీర సాగరమదనం చేసినప్పుడు. వెలువడ్డ విషం నుండి కాపాడేందుకు ధన్వంతరి వచ్చాడని. అప్పుడే అమృతం తెచ్చాడని. ఆ సమయం లో  దేవతలకు చేసిన వైద్యమే నాడీ వైద్యమని. నాడి ని తిరిగి పురుద్ద రించేందుకు శరీరాన్ని బౌతిక,సూక్ష్మ శరీరాల ద్వారా నాడీ వ్యవస్థను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా ఒక వ్యక్తిలో ఉన్న అనారోగ్య సమస్యలు,శారీరక స్థితి, మానసిక స్థితిని అంచనా వేయవచ్చని అతనికి దీర్ఘకాలం పాటు ఎదుర్కునే వైద్య సమస్యను  సైతం కనిపెట్ట వచ్చని  అంటున్నారు.

నాడీ వైద్యం ఒక చారిత్రక ఆధారం...

నాడీ వైద్యం అందే మన భారతీయులు మన పూర్వీకులు మనకు అందించిన వరమని అన్నారు.క్రీస్తుపూర్వం మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ రాజధానిగా దేశాన్ని పరిపాలించమని అంతర్గత యుద్దాలలో మన సంపదను ఒక చోట బద్ర పరిచామని యుద్ధసమయంలో మన ఆయుర్వేద గ్రంధాలు కొన్ని తస్కరించారని మరికొన్ని తగుల పెట్టరాని ఇప్పుడు ఈ వైద్య ప్రక్రియా మాదే అని అంటున్నారని డాక్టర్ కృష్ణం రాజు అన్నారు.యోగులు సిద్ధులు చరకుడు,సంహితుడు మనకు అందించిన వైద్య ప్రక్రియ మనకు వరమని నేడు మనపూర్వీకులు మనకు మాత్రమే సాధ్యమైన నాడీ వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు తీవ్రమైన కృషి చేస్తున్నామని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.మరో సంచికలో నాడీ పతి చికిత్స నిర్ధారణా చేసే నాడీ పరీక్ష/ నాడీ వైద్యానికి మందులుఅవసరమా /చికిత్స పద్దతులు పరిశోదన అంశాలు పూర్తిగా అందిచే ప్రయత్నం చేస్తాము. 

 

By
en-us Political News

  
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే.
బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి.
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది.
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట.
వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు.
ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి.
వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రోజంతా పాజిటివ్‌గా,  యాక్టివ్‌గా ఉండటానికి మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వేసవికాలం వచ్చిందంటే ఆరోగ్య పరంగా మామూలు కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడిమి కారణంగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత విషయంలో కూడా మార్పులు వస్తాయి. శరీరంలో తేమ శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది....
ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా చాలా మంది  శీతాకాలం లేదా రుతుపవన కాలంలో కాళ్ల తిమ్మిరి సమస్య గురించి కంప్లైంట్ చేస్తుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.