మయన్మార్ యువతకు తెలుగువన్ డిజిటల్ గైడెన్స్!
Publish Date:Aug 18, 2026
Advertisement
భారత్, మయన్మార్ దేశాల మధ్య సాంస్కృతిక, మీడియా సంబంధాల బలోపేతం దిశగా పడుతున్న అడుగులలో తెలుగువన్ కీలక పాత్ర పోషిస్తున్నది. మయన్మాన్ సమచారా మంత్రిత్వ శాఖ ప్రతినిథి బృందం ఇటీవలి భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో భేటీ అయ్యింది. ఈ భేటీలో డిజిటల్ మీడియా రంగంలో నూతన అవకాశాలు, పరస్పర సహకారంపై చర్చ జరిగింది. ఈ చర్చ భారత్, మయన్మార్ దేశాల సాంకేతిక, ప్రసార బంధం బలోపేతం దిశగా కీలక ముందడుగుగా నిలిచింది. ఈ భేటీలో మయన్మార్ సమాచార మంత్రిత్వ శాఖ, తెలుగువన్ ఎండీ మధ్య డిజిటల్ కంటెంట్ సృష్టి, టెక్నాలజీ ఎక్స్ ఛేంజ్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలుగువన్ ప్రజంటేషన్లు మయన్మార్ ప్రతినిథి బృందాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్రియేటర్ ఎకానమీ, రేడియో, ఫిలిం అండ్ టీవీ కంటెంట్ క్రియేషన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల రూపకల్పన వంటి పలు కీలక అంశాలపై తెలుగువన్ ప్రజంటేషన్ ను మయన్మార్ ప్రతినిథి బృందం ప్రశంసించింది. పాతికేళ్లకు పైగా డిజిటల్ మీడియా రంగంలో తెలుగువన్ సాధించిన విజయాలను మయన్మార్ మంత్రి టియాన్ లిన్ అభినందించారు. తెలుగువన్ అవలంబిస్తున్న వినూతన కంటెంట్ మోడల్స్, నాణ్యతా ప్రమాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కంటెంట్ మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. మయన్మార్ యువతకు డిజిటల్ కంటెంట్ ద్వారా సాధికారత కల్పించడం అనే అంశంపై మయన్మార్ మంత్రి శ్రద్ధ చూపారు. ఈ లక్ష్య సాధన కోసం, మయన్మార్ యువతకు ఆధునిక డిజిటల్ మెళకువలు అందించేలా తెలుగువన్‌తో భాగస్వామ్యం వహించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్, ఇండిపెండెంట్ డైరెక్టర్లు ముత్తులూరి నరసింహప్ప, కోడే రమేష్, సీఓఓ అట్లూరి దుర్గాప్రసాద్, టెక్నికల్ హెడ్ వెంకట దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ డిజిటల్ మీడియా, ఓటీటీ , కంటెంట్ క్రియేషన్ రంగాల్లో భారత్-మయన్మార్ దేశాల మధ్య ద్వైపాక్షి సాంకేతిక సహకారానికి పునాదిగా నిలుస్తుందని మయన్మార్ మంత్రి టియాన్ లిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. Myanmar Delegation Meet TeluguOne, TeluguOne, ObjectOne, Digital Media Partnership, Kantamaneni Ravishankar, Mayanmar Minister, Tiyanlin
http://www.teluguone.com/news/content/myanmar-delegation-meet-teluguone-36-229148.html





