తెలుపు శాంతికి చిహ్నం.. ఖద్దరు సామాన్య జీవనానికి చిహ్నం.. అందుకే గాంధీగారు రెంటినీ పాటించా లని రాజకీయనాయకులకు బోధించారు. తెలుపు మాట ఎలా ఉన్నా ఖద్దరు మాత్రం కాలంతో పాటు టెర్లీన్ లోకి మారి రాజకీయనాయకులకు అనుకూలమయింది. ఇంకా ఇప్పటికీ ఖద్దరునే వాడే నాయ కులూ ఉన్నారు. కాగా ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల మధ్య విచిత్ర పోటీ జరుగుతోంది. నేనో మొక్క నాటాను అంటే మరో నాయకుడు రెండు మొక్కలు నాటానని వీడియో పెడుతున్నారు. ఇపుడు దుస్తుల విషయం లోనూ పోటీ పెట్టుకున్నారు. నేను చేనేతకు పెద్ద అంబాసిడర్‌ని అంటూ జనసేన నాయకుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నాడు. అంతే వెంటనే చాలామంది నువ్వే కాదు చాలామంది అదే బాటలో ఉన్నారని ప్రకటించారు.
వీరికంటే ముందే మై హ్యాండ్లూమ్ మై ఫ్రెండ్ అంటూ నారాయణ పేట్ కలెక్టర్ హరిచందన సోషల్ మీడి యాలో హల్చల్ చేస్తున్నారు. ప్రజలు చేనేతను ఎక్కువ ఉపయోగించాలన్నది ఆమె ప్రచార సారాం శం. ఆ మాట అందుకున్నారు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి స్మితా సబర్వాల్. అం దుకు కొనసా గింపుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేశారు.
ఈ తరహా చాలెంజ్‌లు ఆరోగ్యకరమే. ఇందులో చేనేతకార్మికులను ప్రోత్సహించాలన్న లక్ష్యమే కనపడు తోంది. క్రమేపీ పోలీసు రంగానికీ పాకింది. హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్‌ను పోచంపల్లి దుస్తులు వేసుకు ని ఫోటోను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు స్పందించారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, ప్రస్తుత కామన్ వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన పి.వీ.సింధు. చాలా చిత్రంగా ఉంది.. దుస్తులు ఏవి, ఎలాంటి వేసుకోవాల న్నదీ మోడల్స్‌లా పోటీపడి మరీ ధరించడం, ప్రచారం చేయడం. ఒక విధంగా చేనేత రంగానికి ఇదో పెద్ద ప్రచారం. ప్రత్యే కించి చేనేత రంగంవారు మీడియాలో ప్రచారం చేసుకోనక్కర్లేదు. ఎవరో ఒక సెలబ్రెటీతో నాలుగు మంచి మాటలు చెప్పించి ఈ దుస్తులు ధరించితే చాలు. అది అలా ఆసేతు హిమాచలం ఫాలో అయిపోతు న్నారు.
గతంలో పచ్చదనం ఆరోగ్యకరం అనే టాగ్‌తో పర్యావరణ పరిరక్షణకోసం ప్రజలకు మొక్కలు నాటడం, చెట్లను పరిరక్షించడం, చెరువులు, నదులను రక్షించుకోవాలన్నలక్ష్యంతో పర్యావరణ శాఖ భారీ ప్రచా రాలే చేసింది. అందుకు చాలామంది స్పందించారు. అన్ని ప్రాంతాల్లోనూ సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఎంతో ప్రోత్సహించారు. ఇదో ఆరోగ్యకర పోటీతత్వాన్ని పెంచింది. ఇది క్రమేపీ అన్ని రంగాలకూ విస్తరిస్తే మరింత బాగుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/my-handloommy-friend-39-141508.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది