‘మార్గదర్శి’పై నిందవేసిన ‘ముష్టి’ అరెస్ట్!
Publish Date:Aug 16, 2024
Advertisement
మార్గదర్శి లాంటి మచ్చలేని సంస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేసిన లాయర్ ముష్టి శ్రీనివాసరావు ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నాడు. రామోజీరావును వేధించడం కోసం జగన్ విజయవాడకు చెందిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావును ఒక పావులా వాడుకున్నాడు. రామోజీరావు మీద, మార్గదర్శి మీద ఈ ‘ముష్టి’ కేసు పెట్టినప్పుడు ఇతనికి అప్పట్లో భారీ స్థాయిలో గౌరవ మర్యాదలు లభించాయి. లేటెస్ట్.గా ఆయన తన ఇంట్లో పేకాట క్లబ్ నిర్వహిస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ రాక్షస ప్రభుత్వంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కాంతి రాణా టాటా ఈ ‘అ’న్యాయవాదికి అతి మర్యాదలు చేసేవారు. ఆయన వస్తుంటే.. లేచి నిలబడి మరీ వినయాన్ని ప్రదర్శించేవారు. మార్గదర్శి చిట్స్ మీద చేసిన తీవ్ర ఆరోపణల్లో ఈ న్యాయవాది కీరోల్ ప్లే చేసేవాడు. ప్రెస్‌మీట్లు పెట్టేవాడు. అది కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్‌తో కలిసి. అలాంటి లాయర్ తన ఇంట్లోనే పేకాట క్లబ్ ఏర్పాటు చేసుకోవడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఈ దాడిలో ‘ముష్టి’తోపాటు జూదం ఆడుతున్న మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొదట పారిపోయిన ముష్టి శ్రీనివాసరావు ఆ తర్వాత తానే వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. ముష్టి శ్రీనివాసరావు మార్గదర్శిలో చేరి, చిట్ వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. చిట్ పాడుకున్న తర్వాత డబ్బు పొందడానికి అవసరమైన ష్యూరిటీలు సమర్పించలేదు. అందువల్ల మార్గదర్శి అతనికి డబ్బు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాను చిట్టీ పాడితే మార్గదర్శి డబ్బులు ఇవ్వలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కంప్లైంట్ కాపీని పట్టుకొని మార్గదర్శి మీద కేసు నమోదు చేయడంతో పాటు.. అతడ్ని పక్కన పెట్టుకొని విజయవాడ సీపీ ప్రెస్ మీట్ పెట్టటమే కాదు.. అతను ప్రెస్ మీట్‌కి వచ్చినప్పుడు లేచి నిలబడి.. సాదరంగా ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకున్న వైనాన్ని జనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రామోజీరావు లాంటి పెద్దమనిషి చికిత్స తీసుకుంటునప్పుడు పోలీసులు వేధించడానికి కారణమైన ఈ వ్యక్తికి ఇంకా శాస్తి జరగాల్సి వుందని అనుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/musti-srinivasa-rao-arrest-25-183076.html





