వైసీపీలో మ్యుజికల్ చైర్స్

Publish Date:Aug 26, 2023

Advertisement

ఏపీలో అధికార పార్టీ వైసీపీ పనైపోయిందన్న చర్చ గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో తీవ్రంగా జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వేలలో వైసీపీకి ఈసారి ఘోర పరాజయం తప్పదనే విషయం బయటపడగా.. ప్రజలలో తీవ్రంగా కనిపిస్తున్న అసంతృప్తితో పలువురు పరిశీలకులు కూడా ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టేశారు. మాకు తిరుగే లేదని.. మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి అందలం ఎక్కిస్తాయని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం తెగ మధనపడిపోతున్నారు. అంతేకాదు, ప్రజలలో అసంతృప్తిని దారి మళ్లించి మాఫీ అయ్యేలా చేసుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు  చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని నేతల మీదకి మళ్లించి.. ఆయా స్థానాలలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

తాజాగా మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టు డే  ఓ సర్వే నిర్వహించింది. అయితే, ఈ సర్వేలో వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వే తేల్చింది.  ఈ 15 ఎంపీ సీట్లను కూడా టీడీపీ ఒంటరిగానే సాధించేస్తుందని చెప్పడం మరో విశేషం. అదే సమయంలో వైసీపీ 3-4 సీట్లకే పరిమితమవుతుందని చెప్పగా.. మిగిలిన సీట్లలో హోరా హోరీ పోటీ ఉంటుందని..  రాజకీయ సమీకణాలను బట్టి ఆయా స్థానాలలో ఫలితాలు ఉండనున్నాయని వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైంది. ఇన్నాళ్ళూ పెయిడ్ సర్వేలతో ఏపీ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసిన వైసీపీ అండ్ కో కు ఇండియా టుడే సర్వేతో కాళ్ళ కింద భూమి కదిలినట్లైంది.

దీంతో నష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టింది. వైసీపీ ప్రజలలో అసంతృప్తి ఎక్కువగా ఉన్న ఎంపీలను పోటీ నుండి తప్పించేసే పని మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. మరోవైపు వివిధ నియోజకవర్గాల్లో గ్రాఫ్ మెరుగుపడని ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానాల మార్పులో భాగంగా శ్రీకాకుళం ఎంపీగా ధర్మాన సోదరుల్లో ఒకరిని, లేదంటే స్పీకర్ తమ్మినేనిని రంగంలోకి దింపనున్నారట. తనయుడికి ఎమ్మెల్యే సీటు ఇస్తే తమ్మినేని ఎంపీగా పోటీకి వెళ్లడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతిని అసెంబ్లీకి పంపి మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాస్ లలో ఒకరిని ఎంపీగా పోటీ చేయించనున్నారట. అలాగే కాకినాడ ఎంపీ వంగవీటి గీతను తప్పించి మాజీమంత్రి కురసాల కన్నబాబు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ఇక, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని పోటీ నుండి తప్పించి ఇక్కడ కూడా ఎవరొకరు ఎమ్మెల్యేను దింపనున్నట్లు తెలుస్తుంది. అమలాపురం ఎంపీగా మంత్రి విశ్వరూప్ పోటీ చేయనుండగా.. బదులుగా ఆయన తనయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా, రామచంద్రాపురంలో మంత్రి వేణు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు మధ్య పంచాయితీ తెలిసిందే. దీనికి పరిష్కారంగా వేణును రాజమండ్రి ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక నరసాపురం ఎంపీగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీగా మాజీమంత్రి ఆళ్ల నాని, లేదా ప్రముఖ పారిశ్రామికవేత్త అరసవెల్లి అరవింద్, నరసరావుపేట నుండి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును పొన్నూరు ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి.. ఇక్కడ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఎంపీగా పోటీకి దించనున్నట్లు తెలుస్తుంది. 

ఇక రాయలసీమ విషయానికి వస్తే.. గూడూరు ఎంపీగా ఉన్న డాక్టర్ మద్దిల గురుమూర్తిని గూడూరు అసెంబ్లీకి పంపి.. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ ను తిరుపతి ఎంపీగా పోటీ చేయించనున్నారట. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఈసారి ఎన్నికల నుండి తప్పించనుండగా.. ఈ స్థానంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ను ఎంపీగా పోటీ చేయిన్చానున్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ వైసీపీ అధిష్టానం ప్రణాళిక కాగా.. ఇందులో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్లమెంటుకు వెళ్లేందుకు ఇష్టపడతారన్నది చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.