నియంతృత్వానికి నిలువెత్తు రూపం.. ముషార్రఫ్

Publish Date:Feb 8, 2023

Advertisement

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చ.  ఈ నెల 5న దుబాయ్‌లో కన్నుమూసిన ముషరఫ్‌ కొన్నేళ్ల పాటు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా సర్వాధికారాలూ చెలాయించారు.  అయితే  చివరికి దుబాయ్‌లో ప్రవాసంలో ఒక సాధారణ వ్యక్తిలా కన్నుమూశారు.

పాక్ సైన్యాధ్యక్షుడిగా 1999 అక్టోబర్‌లో అధికార పర్యటన నిమిత్తం శ్రీలంక వెళ్లారు. తనకు నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఉద్వాసన చెప్పబోతోందని అక్కడ ఉండగా తెలుసుకున్న ముషార్రఫ్ వెంటనే  కరాచీకి బయలుదేరి వచ్చేశారు. సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించి నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని దించేశారు.

వాస్తవానికి ముషార్రష్ ను  సైనిక దళాల ప్రధానాధికారిగా నియమించింది నవాజ్‌ షరీఫే. ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులను పక్కన పెట్టి మరీ ముషరఫ్ ను షరీఫ్ సర్వసైన్యాధికారిని చేశారు.  అదే నవాజ్ ఫరీష్ తప్పిదమని ముషార్రఫ్ ఆయననే పదవి నుంచి దించేయడం ద్వారా రుజువు చేశాడు. సైన్యాధ్యక్షుడిగా తనకు అవకాశంఇచ్చాడన్న కృతజ్ణతా భావమో ఏమో ముషార్రఫ్ ఆయనను ప్రాణాలతో ఉండనిచ్చారని పాక్ చరిత్ర తెలిసిన వారు చెబుతుంటారు. 

పాక్‌ అధ్యక్షుడుగా అధికారం చేపట్టిన తర్వాత ముషార్రఫ్‌ ఒక నియంతలా  వ్యవహరించారు. అందరి కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండాలన్న తపనతో పాటు, భారత్‌ మించిపోవాలన్న తపన కూడా ఆయనకు చాలా ఎక్కువ. భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య మొదటిసారిగా 1965లో యుద్ధం జరిగినప్పుడు ముఫార్రఫ్ ఒక యువ సైన్యాధికారి. 1971లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయన ఒక కమాండోగా ఉన్నారు. అయితే  ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధానికి కూడా రూపకర్త ఆయనే.

ఓ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం మామూలే. అయితే, ఈ దేశాలు అణ్యస్త్రాలను కూడా కలిగి ఉన్నప్పుడు కయ్యానికి కాలు దువ్వడం ఒక విధంగా సాహసమే అవుతుంది. నిజానికి దాదాపు ఆ సమయంలోనే అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్ పేయి భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. తాను స్వయంగా బస్సులో లాహోర్‌కు ప్రయాణించి వచ్చారు. లాహోర్‌ ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఈ సౌహార్ద్రం ముషరఫ్‌కు ఏమాత్రం పట్టలేదు. ఒప్పందం మీద సంతకాలు పూర్తయ్యాయో లేదో ఆయన యుద్ధానికి పథక రచన చేశారు. ఈ దాడిని భారత్‌ తిప్పికొట్టడం, అమెరికా అందుకు సహాయం కూడా చేయడం ఆయనను అన్ని విధాలా దెబ్బతీసింది.

 2001 జూలైలో ఆగ్రాలో శిఖరాగ్ర చర్చలు జరిగాయి. అయితే, ఈసారి కూడా శాంతి చర్చలు, పర్యవసనాలు కాగితాలకే పరిమితం అయ్యాయి.  2001 డిసెంబర్లో పార్లమెంట్‌ మీద లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడులు జరిపారు. వారికి పాకిస్థాన్‌ ప్రభుత్వ అండదండలున్నాయన్న సంగతి ప్రపంచానికి వెల్లడైంది.

 పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తీకర్‌ మహమ్మద్‌ చౌధురి రాజీనామాను డిమాండ్‌ చేయడం ద్వారా ముషార్రఫ్ తన పతనాన్ని తానే రాసుకున్నాడు.  ఇక పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోకు తగినంత భద్రతను కల్పించనందువల్లే ఆమె హత్యకు గురయ్యారనీ, దీనితో ముషర్రఫ్‌కు సంబంధం ఉందని తేలడంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు.  దుబాయ్ లో తలదాచుకున్నాడు.  అక్కడ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశమే లేకపోయింది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.