మంగళసూత్రం మొగుడికే మృత్యు పాశం.. భార్యల చేతుల్లో భర్తల హతం.!

Publish Date:Jul 22, 2026

Advertisement

పవిత్రమైన వివాహ బంధంలో ఇటీవల కాలంలో  ఆందోళనకర ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి.  దంపతుల మధ్య విభేదాలు వస్తే సర్దుకుపోయే సంస్కృతి కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది  కుటుంబ వ్యవస్థలో  ఆందోళనకర, ప్రమాదకర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పవిత్రమైన వివాహబంధం మొగుడూ పెళ్లాల మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమలతో ముడి పడి ఉంటే పరిస్థితి నుంచి పరస్పరం కక్షలూ కార్పణ్యాలతో బద్ధ శత్రువులుగా మారే పరిస్థితి ఉత్పన్నమౌతోంది. ఇటీవలి కాలంలో భార్యల చేతుల్లో హతమౌతున్న భర్తల సంఖ్య పెరిగిపోతోంది.  భర్తలనే భార్యలు హతమార్చడం  వంటి కలవరపరిచే ఉదంతాలు  విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం ఇటీవల ఏకం న్యాయం ఫౌండేషన్  అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన నివేదిక తేటతెల్లం చేసింది. ఈ నివేదిక  భర్తల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సమాజంలో ఏ స్థాయిలో పెరుగుతున్నాయో కళ్లకు కట్టింది.  

ఏకం న్యాయం ఫౌండేషన్   ప్రచురించిన  నివేదిక  మేరకు.. ఈ ఏడాది జనవరి 1 నుంచి గత నెల  14  వరకూ అంటే  ఆరున్నర నెలల వ్యవధిలోనే దేశంలో ఏకంగా 554 మంది భర్తలు భార్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మొత్తం మరణాలను పరిశీలిస్తే, దాదాపు 322 మంది పురుషులు   భార్యల చేతిలోనే  హత్యకు గురయ్యారు.  మరో  182 మంది  భార్యల  వేధింపులు,  మానసిక చిత్రహింసలు కుటుంబ వివాదాలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక  మిగిలినవి అనుమానాస్పద మరణాలు.  

ఈ నివేదిక ప్రకారం.. దేశంలో  ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు తమ భార్యల చేతిలోనే దారుణ హత్యలకు గురవుతున్నారు.  అలాగే  రోజూ కనీసం ఒకరు భార్యల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.  మొత్తం భార్యల చేతిలో హతమైనట్లు నమోదైన  322 హత్య కేసుల్లో  194 కేసులు..   అంటే   60.2 శాతం కేసుల్లో  భార్యల వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమని తేలింది. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతో.. భార్యలు తమ ప్రియుల సహకారంతో ఈ హత్యలకు పాల్పడినట్లు నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని కేసులలో  ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు,  వ్యసనం, అనుమానం, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. 

ఇక పోతే..   భార్యల చేతిలో భర్తలు హత్యకు గురైన సంఘటనతో  పాటు  భార్యల మానసిక వేధింపులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న భర్తల సంఖ్యా పెద్దగానే ఉంది. భార్యల ప్రవర్తన, అక్రమ సంబంధాలు, భార్యల చేతిలో హింసకు గురి కావడం,  తప్పుడు కేసులు పెడతామన్న బెదరింపుల కారణంగా  తీవ్ర ఒత్తిడికి గురై భర్తలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలూ ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని నివేదిక నిర్ద్వంద్వంగా వెల్లడించింది.   

  ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలా భార్యల చేతిలో హతమైన భర్తల సంఖ్య భారీగానే ఉంది. ఎన్సీఆర్బీ ప్రకారం  రాష్ట్రంలో  ఏటా సగటున 898 హత్యలు నమోదు కాగా, వాటిలో  195  వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాల కారణంగానే జరుగుతున్నాయి.   ఈ విషయంలో   దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.  

మారుతున్న జీవనశైలి,  విలువలు క్షీణత ఇటువంటి సంఘటనలకు కారణంగా మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఈ తరహా ధోరణి పెచ్చరిల్లడంతో ప్రపంచానికే ఆదర్శంగా చెప్పుకునే భారత కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమౌతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ తీసుకోవడం, కూర్చుని మాట్లాడుకోవడం, అవసరాన్ని బట్టి  మానసిక వైద్యులను సంప్రదించడం ద్వారా దంపతుల మధ్య విద్వేషాలు, వివాదాలూ తీవ్ర నేరాల స్థాయికి చేరకుండా నివారించడానికి దోహదం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దంపతుల మధ్య  అవగాహన, సహనం పెరగడంతో పాటు చట్టపరమైన ప్రాసెస్ పై స్పష్టత ఉన్నప్పుడే సమాజంలో ఈ తరహా నేరాలు తగ్గుతాయని చెబుతున్నారు. 

Murders of husbands, extramarital affairs, Ekam Nyayam Foundation, domestic violence cases, Andhra Pradesh crime statistics

By
en-us Political News

  
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
లోహియా కార్ప్ ఐపీఓ ప్రారంభమైంది. రూ. 404 425 ధరల శ్రేణి, 8.47% జిఎంపి లాభాలు, ఆఫర్ ఫర్ సేల్ వివరాలు, కేటాయింపు డేట్లు మరియు బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీలో బోస్టన్ డైనమిక్స్ అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోల ప్రవేశానికి వ్యతిరేకంగా 39,000 మంది కార్మికులు చేపట్టిన చారిత్రాత్మక సమ్మె, రూ. 1,000 కోట్లకు పైగా ఉత్పత్తి నష్టం మరియు AI రోబోటిక్స్ యుగంలో ఉద్యోగ భద్రత గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అమెరికాలోని ఇర్మో పట్టణంలో పోలీసు అధికారుల కంటే ఎక్కువగా ఏఐ నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లాక్ కెమెరాల డేటా భద్రత, సైబర్ లోపాలు మరియు పౌర హక్కుల ఉల్లంఘనపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీకోసం.
జెన్ జీ ఉద్యోగులు ఆఫీస్ కంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్నారని యూగోవ్ సర్వే తెలిపింది. ఆఫీస్ డిస్ట్రాక్షన్స్, వర్క్ సంస్కృతి మరియు ఉత్పాదకతపై 53 శాతం మంది వెల్లడించిన కీలక నిజాలు ఇక్కడ చదవండి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ పెట్టుబడులు మరియు మాంద్యంలో ధనవంతులుగా మారే రహస్యాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
భారతదేశం రాబోయే పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకుని జూలై నుండి అక్టోబర్ వరకు నెలకు 15 లక్షల టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోవడానికి సిద్ధమైంది. సన్‌ఫ్లవర్, పామ్ ఆయిల్ ధరలు మరియు మార్కెట్ పరిస్థితులపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.