వైఎస్సాఆర్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం.. చేసింది ఎవరంటే?
Publish Date:Mar 24, 2021
Advertisement
సూరీడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెన్నంటే ఉన్న అనుచరుడు. సురీడు మీద అతని ఇంట్లో దాడి జరిగింది. జూబ్లీహిల్స్‌లోని అతని నివాసంలోకి బలవంతంగా ప్రవేశించి క్రికెట్ బ్యాట్‌తో అటాక్ చేశాడు. బ్యాట్‌తో విచక్షణారహితంగా కొట్టడంతో సురీడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ సురీడు మీద దాడి చేసింది ఎవరో తెలుసా? అతని అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి. గతేడాది కూడా సురీడు మీద దాడి చేశాడు అతని అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి. సురీడు కుటుంబంలో కొంతకాలంగా కలహాలు ఉన్నాయి. తన కూతురును అల్లుడు వేధిస్తున్నాడంటూ గతంలో సురేంద్రనాథ్‌రెడ్డి మీద గృహహింస కేసు పెట్టాడు సురీడు. ఆ కేసును విత్‌డ్రా చేసుకోవాలంటూ సురేంద్రనాథ్ పలుమార్లు సురీడు మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎంత చెబుతున్నా కేసు ఉపసంహరించుకోకపోవడంతో సురీడు మీద కోపం పెంచుకున్నాడు సురేంద్రనాథ్. తాజాగా, జూబ్లీహిల్స్‌లోని సూరీడు ఇంటికొచ్చి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్యాయత్నం చేశాడు అతని అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి. సురీడు కుమార్తె గంగా భవానీ ఫిర్యాదు మేరకు సురేంద్రనాథ్‌రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. సురీడు. వైఎస్సార్ హయాంలో ఆయన వెంటే ఉంటూ నిత్యం కనిపించేవారు. వైఎస్ మరణం తర్వాత సురీడు కనుమరుగయ్యారు. జగన్ సీఎం అయినా సురీడు ముందుకు రాలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల మల్లీ ప్రజల ముందుకు వచ్చారు. రైతు రణభేరి సభలో ప్రత్యక్షమై రేవంత్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. అన్నేళ్ల తర్వాత సురీడు మళ్లీ రాజకీయ తెరపైకి రావడంతో అంతా ఆసక్తి కనబరిచారు. అప్పట్లో వైఎస్సార్ వెంట ఉన్నట్టే.. ఇకపై రేవంత్‌రెడ్డి వెంబడి ఉంటారని ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. లేటెస్ట్‌గా అల్లుడి చేతిలో తీవ్రంగా గాయపడి ఈ విధంగా మళ్లీ వార్తల్లో నిలిచారు సురీడు.
http://www.teluguone.com/news/content/murder-attempt-on-ysr-follower-sureedu-25-112463.html





