టీఆర్ ఎస్‌ను మునుగోడు ప్ర‌జ‌లు న‌మ్మ‌రు..రాజ‌గోపాల్‌రెడ్డి

Publish Date:Oct 17, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఎలాగ‌యినా గెలిచి రాష్ట్ర రాజ‌కీయాల్లో తిరుగులేని పార్టీగా టీఆర్ ఎస్ చ‌క్రం తిప్పాల‌ని చూస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు సెమీస్‌గా భావిస్తున్న మునుగోడు ఎన్నిక‌ల్లో ఎలాగ‌యినా భారీ మెజారిటీతో గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌ను టీఆర్ ఎస్ ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ ఆలోచ‌న‌తోనే త‌న చుట్టూ ఉన్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను టీఆర్ ఎస్ నేత‌లు ప‌శువుల్లా కొనుగోలు చేస్తున్నార‌ని బీజేపీ అభ్య‌ర్ధి, మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్ర‌జ‌లు టీఆర్ ఎస్‌ను న‌మ్మే స్థితిలో లేర‌ని వారికి ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ధి చెబుతార‌నీ అన్నారు. 

మునుగోడు ఇపుడు బీజేపీవారికీ కీల‌కంగా మారింది. కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డానికి ఎంతో ఆస‌క్తి చూపుతూ దూసుకుపోతున్న త‌రుణంలో, పార్టీ పేరు కూడా బీఆర్ ఎస్‌గా మార్చి మ‌రీ కేంద్రం మీద విరు చు కుప‌డుతున్న స‌మ‌యంలో వ‌స్తున్న ఈ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌న్న‌దే  బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అందుకు కాంగ్రెస్‌నుండి త‌మ పార్టీలోకి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి పై ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. ఒక స‌మ‌యంలో ఆయ‌న త‌ప్ప‌కుండా భారీ మెజారిటీతో  గెలిచే అవ కాశా లున్నాయ‌ని ప్ర‌చారం చేసుకుంటూ వ‌స్తున్న బీజేపీ ఇప్ప‌టి ప‌రిస్థితుల దృష్ట్యా అంత సీన్ లేదన్న అను మానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌ని ఒక వంక కాంగ్రెస్, మ‌రో వంక టీఆర్ ఎస్ మ‌రింత విజృంభిస్తున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్ధి ముందే మునుగోడులో దూసుకుపోతు న్నారు. 

కాగా,  ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి చండూరు చౌరస్తాలో  రాజ‌గోపాల్ రెడ్డి  మాట్లాడు తూ,  మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్ ఎస్ ను  నమ్మే పరిస్థితిలో లేరని, వారంతా బీజేపీ వైపే చూస్తు న్నారని అన్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను పార్టీ మారాలని పోలీసులతో టీఆర్ ఎస్‌ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. మునుగోడును దత్తత తీసు కుంటానన్న కేటీఆర్ తాను మూడేళ్లుగా అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడిగితే కనీసం స్పందించ లేదన్నారు.  తెలంగాణ ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో పార్టీ ఫండ్‌ కావాలని అడిగితే కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలకు తాను కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశానన్నారు. 

అభివృద్ధి అంటే సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాలకే పరిమితమా? మునుగోడు నియోజక వర్గానికి నిధులు ఎందుకివ్వర‌ని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపికి ప్రజలు పట్టం కడుతున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కేసీఆర్‌ దేనన్నారు. పార్టీ మారితే తప్ప అభివృద్ది చేయలేరా అని ప్రశ్నించారు. 

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.